YSRCP Plenary 2022 : మంత్రి రోజాకు ప్లీనరీలో చురకలు
మంత్రి రోజాకు గుంటూరు వైసీపీ ప్లీనరీ వేదికగా మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చురకలు వేశారు.
- By CS Rao Published Date - 02:39 PM, Fri - 8 July 22

మంత్రి రోజాకు గుంటూరు వైసీపీ ప్లీనరీ వేదికగా మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చురకలు వేశారు. ప్రసంగంలో టైం సెన్స్ లేదని పరోక్షంగా ఆమెను విమర్శించారు. పది నిమిషాల సమయం ఇస్తే, 19 నిమిషాలు మాట్లాడారని సెటైర్లు వేశారు. అందరూ ఇలాగే టైం సెన్స్ లేకుండా మాట్లాడితే మిగిలిన వాళ్లు ప్రసంగించే అవకాశం ఉండదని చురకలు వేశారు. మంత్రి రోజా ప్రసంగంలో 19 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి, విజయమ్మను కీర్తిస్తూ 12 నిమిషాలకు పైగా తీసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ ను విమర్శించడానికి 5 నిమిషాలు వినియోగించారు.
మిగిలిన రెండు నిమిషాలు దిశా యాప్, రాష్ట్రంలో మహిళ ల భద్రత గురించి మాట్లాడారు. ఆమె వేదికపైకి రాగానే క్యాడర్ నుంచి అనూహ్య స్పందన కనిపించింది. సినిమా స్టైల్ డైలాగులను వినిపించిన ఆమె ప్రసంగానికి సభికుల నుంచి ఆదరణ లభించింది. జంబలకిడిపంబ పార్టీగా టీడీపీ గురించి వేసిన డైలాగు క్యాడర్ ను విజిల్స్ వేయించింది. వేదికపైన కూర్చొన్న సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ డైలాగుతో కనిపించారు. మొత్తం మీద వైసీపీ ప్లీనరీలోని రోజా ప్రసంగం సొంత పార్టీలోని లీడర్లకు టైం సెన్స్ లేకుండా ఉన్న ప్రసంగంగా ఉండగా, క్యాడర్ కు మాత్రం రుచించింది. జగన్మోహనరెడ్డిని స్తుతిస్తూ ఆమె చేసిన ప్రసంగం ఆయనకు నవ్వులు, ఉద్వేగం కలిగేలా చేసింది.