TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…గంటన్నర వ్యవధిలోనే సర్వదర్శనం..!!
శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీపికబురందించారు.సర్వదర్శం చేసుకునే భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ అవసరం లేదు. కేవలం గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కలిపించనున్నట్లు ఈవో తెలిపారు.
- By hashtagu Published Date - 09:34 AM, Thu - 9 June 22

శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీపికబురందించారు.సర్వదర్శం చేసుకునే భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ అవసరం లేదు. కేవలం గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కలిపించనున్నట్లు ఈవో తెలిపారు. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులు వేగంగా దర్శనం చేసుకునే వీలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహించి వీఐపీ బ్రేక్ దర్శనం సిపార్సు లేఖలను తీసుకోవడం లేదని తెలిపారు శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నిధులతో 150 కొత్త ఆలయాలు నిర్మించనున్నట్లు ధర్మారెడ్డి చెప్పారు. అంతేకాదు దాదాపు 100 పురాతన ఆలయాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.
మరో 5వందల ఆలయాలను పునరుద్దరించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమలలో దళారీ వ్యవస్థను నిరోధించడం ద్వారా రూ. 215కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామివారికి చేరుతాయని స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 15వందల కోట్ల విరాళాలను తీసుకురాగలిగామన్నారు. తిరుమలలో 7,500గదులకు 40ఏండ్లుగా మరమ్మత్తులు చేయలేదని కోవిడ్ సమయంలో 4,500గదులకు మరమ్మతులు చేసినట్లు వివరించారు.