Big Alert: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక…ఇక నుంచి..!!
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు సమర్పించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
- By hashtagu Published Date - 09:15 AM, Tue - 6 September 22

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు సమర్పించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు స్వామివారికి అందించే కానుకలు టీటీడీకి చేరవని…కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ ఉండదని తెలియజేసింది.
కాగా సెప్టెంబర్ 27 వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మెత్సవాలు జరగనున్నాయి. ఈ సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుపతికి తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఎప్పటినుంచో వస్తున్న అనవాయితీ.తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియకుండా దోషాలు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు లోపం రానీయకుండా ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ.