HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ttd 2026 Diaries And Calendars Available For Devotees

TTD Calendars: తిరుమ‌ల భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. అందుబాటులో డైరీలు, క్యాలెండర్లు!

బెంగళూరుకు చెందిన ఎం. రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీకి ఉదారంగా విరాళం అందించారు. సోమవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ దాత టీటీడీ బర్డ్ ట్రస్టుకు (BIRD Trust) రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

  • Author : Gopichand Date : 13-10-2025 - 11:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TTD Calendars
TTD Calendars

TTD Calendars: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు (TTD Calendars), డైరీల (Diaries) విక్రయాలను భక్తుల సౌకర్యార్థం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్గాల్లో ప్రారంభించింది. శ్రీవారి భక్తులు సులభంగా వీటిని పొందేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది.

క్యాలెండర్లు, డైరీల వివరాలు

టీటీడీ 2026 సంవత్సరానికి సంబంధించి 12-పేజీలు, 6-పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను అందుబాటులో ఉంచింది. వీటితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు క్యాలెండర్లు, అలాగే శ్రీవారు, అమ్మవారు ఇరువురు ఉన్న క్యాలెండర్‌లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచింది.

ఆఫ్‌లైన్ విక్రయ కేంద్రాలు

ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. అంతేకాక తిరుచానూరులోని టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర నగరాల భక్తుల కోసం విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ (హిమయత్ నగర్, జూబ్లీహిల్స్‌లోని ఎస్వీ ఆలయాలు), బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులలోని టీటీడీ కౌంటర్లతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కల్యాణమండపాల్లో కూడా క్యాలెండర్‌లు, డైరీలను అందుబాటులో ఉంచారు.

Also Read: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

ఆన్‌లైన్ కొనుగోలు సౌలభ్యం

ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే భక్తుల కోసం www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా పొందే సౌలభ్యాన్ని కల్పించారు. గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టీటీడీ డైరీలు, క్యాలెండర్లను పొందే సౌలభ్యం ఉంటుంది.

బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

బెంగళూరుకు చెందిన ఎం. రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీకి ఉదారంగా విరాళం అందించారు. సోమవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ దాత టీటీడీ బర్డ్ ట్రస్టుకు (BIRD Trust) రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు అందజేశారు. ఈ విరాళాన్ని బర్డ్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి వినియోగిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • devotional news
  • TTD Birrd Trust
  • TTD Calendars
  • TTD Diaries

Related News

Mahashivratri

మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

నెయ్యి అందుబాటులో లేకపోతే వీటిని వాడవచ్చు. ఇది శని దోషం, ప్రతికూల శక్తి మరియు భయం నుండి విముక్తిని ఇస్తుంది.

  • Mahashivratri 2026

    మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

  • Mahashivratri

    రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

  • Mahashivratri 2026

    మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

  • Mahashivratri 2026

    మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారి ద‌శ తిరిగిన‌ట్లే!

Latest News

  • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

  • లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

  • Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

  • Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

  • ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd