HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tirumala Vip Break Darshan Ticket Now You Can Get It Online This Is The Process

VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు.. ఆన్‌లైన్‌లో పొందడం ఇలా..

VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల కోసం ఇంతకుముందు తిరుమల శ్రీవారి భక్తులు నానా అగచాట్లు పడేవారు.

  • By Pasha Published Date - 09:23 AM, Tue - 6 February 24
  • daily-hunt
Bomb Threats In Tirumala
Bomb Threats In Tirumala

VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల కోసం ఇంతకుముందు తిరుమల శ్రీవారి భక్తులు నానా అగచాట్లు పడేవారు. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను జారీ చేసేందుకు తొలుత భక్తుల వివరాలను నమోదు చేసుకుని రసీదు ఇచ్చేవారు. ఆ తర్వాత ‘ఎంబీసీ 34’ కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి.. నగదు లేదా యూపీఐ, కార్డ్‌ ద్వారా చెల్లించి భక్తులు టికెట్‌‌‌ను పొందేవారు. ఈక్రమంలో భక్తుల ఎంతో సమయం వేస్ట్ అయ్యేది. ఇకపై ఇంత వెయిటింగ్ అక్కర్లేదు. ఎందుకంటే.. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనూ లభించనున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్‌కు ఓ లింక్‌తో కూడిన మెసేజ్‌ను పంపుతారు. భక్తులు ఆ లింకు క్లిక్‌ చేస్తే పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది. అక్కడ ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తే వెంటనే టికెట్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల(VIP Break Darshan Ticket) జారీ కోసం గత మూడు రోజులుగా టీటీడీ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేస్తోంది. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకొన్న తర్వాత పూర్తిస్థాయిలో ఈ పద్ధతిని అమల్లోకి తేనున్నారు. ఇప్పటికే ఆర్జిత సేవలకు కరెంట్‌ బుకింగ్‌ లక్కీడిప్‌లో టికెట్‌ పొందిన భక్తులు ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌ ద్వారా నగదు చెల్లించి దర్శన టికెట్‌‌ను పొందుతున్నారు. ఇదే విధానాన్ని వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Also Read : Anti Cheating Bill : అక్రమార్కులకు ఖబడ్దార్.. లోక్‌సభలోకి ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌’ బిల్లు

తిరుమల శ్రీవారికి అరుదైన విరాళం

తిరుమల శ్రీవారికి సోమవారం బిగాస్ సంస్థ ప్రతినిధులు విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ వాహనం ధర రూ.1.20 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా ఆలయం దగ్గర ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ జానకీరామ్ రెడ్డి, తిరుపతికి చెందిన గాయత్రి ఆటోమోటివ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

7న తిరుమ‌ల‌లో “శ్రీ వేంక‌టేశ్వ‌ర న‌వ‌ర‌త్న మాలిక‌”

కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్ర‌వరి 8 నుంచి 10 వరకు తిరుమల ఆస్థాన మండ‌పంలో జరుగనున్నాయి. ఫిబ్ర‌వ‌రి 7న బుధవారం తిరుమలలోని కల్యాణవేదికలో రాత్రి 7 గంటలకు యువ కళాకారులతో “శ్రీ వేంక‌టేశ్వ‌ర న‌వ‌ర‌త్న మాలిక” గోష్టిగానం నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ పురందరదాసు 4.75 లక్షలకు పైగా సంకీర్తనలు రచించారు. వీటిలో ప్రధానమైన తొమ్మిది సంకీర్తనలను దాదాపు 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్టిగానం చేస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్ల‌ను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • tirumala
  • ttd
  • VIP Break Darshan Ticket

Related News

YSRCP leaders have swallowed crores of rupees of TTD funds: TTD Chairman BR Naidu

TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త

TTD : రాష్ట్రంలో మూడు కొత్త టీటీడీ ఆలయాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్, దుబ్బాక, మంథని ప్రాంతాల్లో వీటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు

  • TTD Chairman

    TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

Latest News

  • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

  • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

  • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

Trending News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd