Chandrababu: గెలుపు గుర్రాలకే టికెట్లు: చంద్రబాబు
గెలిచే అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తానని, అంతర్గత సర్వేల్లో నేతల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:52 PM, Sat - 9 December 23

Chandrababu: గెలిచే అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తానని, అంతర్గత సర్వేల్లో నేతల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే ఓట్ల తారుమారు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్‌ఛార్జ్‌లు బాధ్యత వహించాలని చంద్రబాబు చెప్పారు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అలసత్వం వహించవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా నేతలతో ఆయన ఈ రోజు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు టీడీపీ చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. తెలుగుదేశం, జనసేన నాయకులు కలిసి వేదిక పంచుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసి జగన్ ఇంటికి పంపించేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలోనూ కలిసి పోరాడాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా చంద్రబాబుతో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నేతలు భేటీ అయ్యారు. తెలుగుదేశం, జనసేన నిర్వహించే కార్యక్రమాల్లో నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు వారికి సూచించారు.
Also Read: Karimnagar: కరీంనగర్ లో మావోయిస్టు అరెస్ట్