Vizianagaram : మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
Vizianagaram : అనకాపల్లి (Anakapalli)కి చెందిన దంపతులు తమ మూడున్నరేళ్ల కూతురితో కలిసి గంట్యాడ మండలంలోని ఒక గ్రామానికి ఫంక్షన్ కోసం వెళ్లగా
- By Sudheer Published Date - 06:46 PM, Mon - 28 October 24

విజయనగరం(D)లో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఏపీలో వరుస అత్యాచారాలు (Rape Incident) ఆగడం లేదు..వరుసగా రాష్ట్రంలో ఎక్కడో చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వం మారింది..ఆడ బిడ్డలకు రక్షణ ఉంటుందని అంత భావించారు. కానీ ప్రభుత్వం మారిన కామాంధులు మాత్రం మారడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తునప్పటికీ కామాంధులు మాత్రం వారి అరాచకాలను ఆపడం లేదు. కామంతో అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. యువకులే కాదు 60 , 70 ఏళ్ల వయసు ఉన్న వృద్దులు కూడా అత్యాచారాలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. మరికొంతమంది స్నేహం ముసుగులో అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
తాజాగా విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి (Anakapalli)కి చెందిన దంపతులు తమ మూడున్నరేళ్ల కూతురితో కలిసి గంట్యాడ మండలంలోని ఒక గ్రామానికి ఫంక్షన్ కోసం వెళ్లగా, స్థానికుడు రవి ఆ బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటనను గమనించిన గ్రామస్థులు రవిని చితకబాది, అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తర్వాత చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి సంధ్యారాణి ఆసుపత్రికి వెళ్లి బాధిత చిన్నారిని పరామర్శించారు. ఈ సందర్భంలో ఆమె, నిందితుడికి బెయిల్ కోసం లాయర్లు సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీసులు గట్టిగా స్పందించి, బాధితుల కుటుంబాలకు అన్ని రకాల సాయం అందించాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
Read Also : Hyderabad : ఆంక్షలపై హరీష్ రావు ఆగ్రహం..మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చింది