Three Farmers Lost Life : బోరును రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురు రైతులు మృతి
Three Farmers Lost Life : కరెంటు షాక్ కు గురై ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.
- By Pasha Published Date - 11:13 AM, Sat - 23 September 23

Three Farmers Lost Life : కరెంటు షాక్ కు గురై ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని ఉప్పలపాడులో చోటుచేసుకుంది. పామాయిల్ తోటలో అగ్రికల్చర్ బోరుకు మరమ్మతు పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్ కు గురై అన్నదాతలు చనిపోయారు. పొలంలోని కరెంటు వైర్స్.. బోరు పైపులకు తగలడంతో రైతులు షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన రైతులను బోదిరెడ్డి సూరిబాబు (35), కిల్లినాడు (40), గల్ల బాబీ (24)గా గుర్తించారు. కాకినాడ – ఉప్పలపాడు నుంచి రాజపూడి వెళ్లే దారిలో ఉన్న పామాయిల్ తోటలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన ముగ్గురు రైతుల్లో.. ఒకరు బోరుకు సంబంధించిన రైతు కాగా మిగిలిన ఇద్దరు జగ్గంపేటకు చెందినవారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యుల గుండెలవిసేలా (Three Farmers Lost Life) రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.