Pawan Kalyan : విశాఖలో మూడ్రోజులు జనసేన సమావేశాలు
Pawan Kalyan : క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు, 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు
- By Sudheer Published Date - 04:04 PM, Sun - 24 August 25

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 28 నుంచి విశాఖపట్నంలో మూడు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశ్యం. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి పెద్ద సమావేశాలు కావడంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో నేరుగా మాట్లాడనున్నారు.
BSNL : వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త.. తక్కువ ధరకే 3జీబీ డేటా..84 డేస్ వ్యాలిడిటీ!
మొదటి రోజు ఈ నెల 28న ఉదయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన విజయం సాధించి, ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే రోజు మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో ఆయన సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత విషయాలపై చర్చిస్తారు.
రెండో రోజు 29న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 10-15 మంది కార్యకర్తలతో పాటు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో భేటీ అవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు, 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులనుద్దేశించి ప్రసంగించనున్నారు. రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన స్పష్టమైన సందేశం ఇస్తారని భావిస్తున్నారు.