HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Thieves Break Into Ap Assembly Premises

Theft : ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం

Theft : టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10 వేలు, ఆయన గన్‌మన్ జేబులో రూ.40 వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50 వేలు, మరొక వ్యక్తి జేబులో రూ.32 వేలు మాయం అయ్యాయి

  • Author : Sudheer Date : 03-04-2025 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thieves Break Into Ap Assem
Thieves Break Into Ap Assem

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణ(Andhra Pradesh Legislative Assembly Premises)లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయని భావించినా, నిన్న జరిగిన దొంగతనం ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవం (Swearing-in ceremony of MLCs)సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు పెద్ద ఎత్తున ఉండగా, దొంగలు మాత్రం తమ చేతివాటం చూపించారు. ఈ సంఘటనలో టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10 వేలు, ఆయన గన్‌మన్ జేబులో రూ.40 వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50 వేలు, మరొక వ్యక్తి జేబులో రూ.32 వేలు మాయం అయ్యాయి. మొత్తం మీద దొంగలు సుమారు రూ.4 లక్షల మేర చోరీ చేసినట్లు భావిస్తున్నారు.

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ షాకింగ్ నిర్ణ‌యం.. ముంబై నుంచి గోవాకు!

ఈ ఘటనతో శాసనసభ భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజధాని అమరావతిలోనే అసెంబ్లీ సముదాయంలో ఇలాంటి దొంగతనాలు జరగడం ఊహించని పరిణామంగా మారింది. సాధారణ ప్రజలకు కంటే, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే దొంగలు సాహసానికి ఒడిగట్టడం భద్రతాపరమైన లోపాలను స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఆవరణలో సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ, ఇంత పెద్ద మొత్తంలో నగదు అపహరణకు గురికావడం బాధ్యతారాహిత్యాన్ని వెల్లడిస్తోంది.

RCB vs GT: సొంత మైదానంలో బెంగ‌ళూరుకు భారీ షాక్ ఇచ్చిన గుజ‌రాత్‌!

ఈ ఘటనపై అసెంబ్లీ భద్రతా విభాగం, పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. దొంగతనానికి పాల్పడ్డవారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ లాంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతాపరమైన వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • New MLCs
  • Swearing-in ceremony of MLCs
  • Theft

Related News

Raghurama Krishna Raju.

సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

Raghurama Krishna Raju   సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమ

  • Minister Narayana

    గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

  • Ap Budget 2026–27

    నేడు ఏపీ బడ్జెట్..

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd