Chandrababu Favorite Ministers: చంద్రబాబుకు ఇష్టమైన మంత్రులు వీరే.. లిస్ట్ ఇదే!
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటడంతో కేబినెట్‌లో ఎవరు ఎలా పని చేస్తున్నారనే రిపోర్టును చంద్రబాబు రెడీ చేసిన తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తి అయింది.
- Author : Gopichand
Date : 21-12-2024 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Favorite Ministers: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు 164 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే విజయం సాధించి ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. అయితే అధికారం చేపట్టిన మొదట్నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జెట్ స్పీడ్‌తో పనులు మొదలుపెట్టారు. ప్రతిపక్ష వైసీపీకి అవకాశం ఇవ్వకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇప్పటికే పింఛన్లు పెంచిన కూటమి ప్రభుత్వం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటడంతో కేబినెట్‌లో ఎవరు ఎలా పని చేస్తున్నారనే రిపోర్టును చంద్రబాబు రెడీ చేసిన తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తి అయింది. దాంతో మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితమైన అంచనాకు వచ్చారని అంటున్నారు. బాబు పెట్టుకున్న బెంచ్ మార్క్‌ని రీచ్ అయిన వారిలో కొందరు మంత్రులు పేర్లు (Chandrababu Favorite Ministers) ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వారి పేర్లు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. ఇకపోతే చంద్రబాబు పెట్టుకున్న బెంచ్ మార్క్ రీచ్ అయిన మంత్రులను చూస్తే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి ప్లేస్‌లో ఉన్నారని తెలుస్తోంది. పవన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో ఐదు శాఖలకు మంత్రులుగా కూడా ఉన్నారు. ఆయన చేపట్టిన అన్ని శాఖలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది.
Also Read: BCCI New Secretary: బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎన్నికకు రంగం సిద్ధం.. జనవరి 12న కీలక మీటింగ్!
మంత్రులు లోకేష్, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్ కూడా చంద్రబాబు దృష్టిలో పడినట్లు సమాచారం. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లు కూడా తమకు కేటాయించిన శాఖల్లో ఉన్నతంగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కూటమిలో కొందరి మంత్రుల ప్రవర్తన పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి కేటాయించిన శాఖలను వారు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని బాబు భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.