AP: ఏపిలో సంక్షేమ పథకాల నిధుల విడుదల ప్రారంభం
- Author : Latha Suma
Date : 16-05-2024 - 11:54 IST
Published By : Hashtagu Telugu Desk
Release Of Funds For Welfare Schemes: ఏపిలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఎన్నికల సంఘం(Election Commission)(ఈసీ) అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆయా పథకాలకు నిధుల విడుదల ప్రారభంమైంది. ఈసీ నుంచి ఇప్పటికే అనుమతి రావడంతో తొలుత కొన్ని పథకాలకు నిధుల్ని విడుదల చేస్తున్నారు. దీంతో ఆయా పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ఈరోజు నుంచి నిధులు పడనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఏపిలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు ఇస్తున్న నిధులు విడుదల కాలేదు. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్ అదేశాల మేరకు పథకాలకు నిధుల విడుదల ప్రారంభించారు. ముందుగా ఆసరాకు రూ.1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కు రూ.502 కోట్లు విడుదల చేశారు. మిగిలిన పథకాలకూ వరుసగా నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Read Also: Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. గోల్డ్ మెడల్ కొట్టాడు..!
మరో రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కు ముందు డీబీటీ నిధుల విడుదలను ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో ఆ తర్వాత నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు నిధుల విడుదల ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. రాజకీయ కారణాలతో ఆగిన రూ.14 వేల కోట్ల నిధులు ఇప్పటికైనా విడుదల కానుండటంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.