HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Nara Lokesh Craze In Dallas Is Mind Blowing

Nara Lokesh : డల్లాస్ లో నారా లోకేష్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే !!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌ కు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh) కు డల్లాస్‌ లో ఘన స్వాగతం లభించింది

  • Author : Sudheer Date : 07-12-2025 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Dallas
Lokesh Dallas

ఆంధ్రప్రదేశ్‌ కు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh) కు డల్లాస్‌ లో ఘన స్వాగతం లభించింది. ఎన్నారై టీడిపి నాయకులు, అభిమానులు, కూటమి నాయకులు ఇతరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. డల్లాస్‌ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు విదేశాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో NDA కూటమి చారిత్రక విజయం వెనుక విదేశీ తెలుగు ప్రవాసుల పాత్ర ఎంతో ఉందని, కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలబడినందుకు ఆయన ప్రవాసులకు కృతజ్ఞతలు అన్నారు. కేవలం NRIలు అనడం కంటే, వీరిని “Most Reliable Indians MRIs)అత్యంత విశ్వసనీయ భారతీయులు” గా లోకేశ్ అభివర్ణించడం ప్రవాస తెలుగువారిపై ఆయనకున్న గౌరవాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తుంది. తెలుగు డయాస్పోరా తమకు అండగా నిలబడినట్లే, తమ ప్రభుత్వం కూడా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ విజయం కేవలం పార్టీ కార్యకర్తల, నాయకుల కృషి మాత్రమే కాకుండా, విదేశాల నుండి వచ్చిన ఆర్థిక, నైతిక మద్దతు కూడా కీలకమని లోకేశ్ స్పష్టం చేశారు. అందుకే ఆంధ్రలో అయినా, అమెరికాలో అయినా కార్యకర్తే, ప్రవాసులే తమకు అధినేతలు అని ఆయన పేర్కొన్నారు.

Lokesh Dallas2

Lokesh Dallas2

ఎన్నికల విజయం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తోంది. ఏపీ ఇప్పుడు భారతదేశానికి “వే బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador of Speed)గా మారిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కేంద్రీకృత అభివృద్ధికి స్వస్తి పలికి, రాష్ట్రాన్ని 8 ముఖ్యమైన పారిశ్రామిక, ఆవిష్కరణ జోన్‌లుగా విభజించి వికేంద్రీకృత అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని ఆయన వివరించారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే దాదాపు ₹20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, దీని ద్వారా 16 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని లోకేశ్ వెల్లడించారు. విదేశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ‘కళ్లకు రెక్కలు’ అనే పథకం ద్వారా మద్దతు ఇస్తామని, అలాగే AP NRT ద్వారా విదేశీ తెలుగు ప్రవాసుల కుటుంబాలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువత కేవలం ఉద్యోగాలు వెతుక్కోవడమే కాకుండా, ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుస్థిరత చాలా ముఖ్యమని నారా లోకేశ్ పేర్కొన్నారు. NDA కూటమి రాష్ట్రంలో రాబోయే 15 సంవత్సరాల పాటు సుస్థిరమైన రాజకీయ స్థిరత్వాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దీర్ఘకాలిక స్థిరత్వం రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు, నిరంతర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని వివరించారు. అభివృద్ధి అగ్ర ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేస్తూనే, గతంలో మహిళలను అవమానించిన వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అంటే, అభివృద్ధి ఒక్కటే కాకుండా, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, సామాజిక న్యాయానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన సంకేతం ఇచ్చారు. నవశకానికి నాంది పలికిన ఈ ప్రభుత్వంలో, ప్రవాసులు, యువత చురుకైన భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lokesh Dallas
  • Lokesh Dallas Speech
  • nara lokesh
  • Nara Lokesh US Tour
  • NRI

Related News

Nri Darshan Process At Tiru

ఒరిజినల్ పాస్‌పోర్టు, ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఉంటే.. ఎన్నారైలకు సులభంగా శ్రీవారి దర్శనం!

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అనేది కోట్లాది భక్తుల కల. దేశంలోనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ తిరుమల యాత్రను తమ ప్రయాణంలో భాగంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ ఎన్నారైలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎన్నారై భక్తులు తిర

    Latest News

    • జనవరి 4 న భోగాపురంలో తొలి ఫ్లైట్ ల్యాండింగ్

    • టోల్ మినహాయింపు లేఖ పై కాంగ్రెస్ పై బిఆర్ఎస్ విమర్శలు

    • అసలు పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ?..దీన్ని ఎవ‌రు తిన‌కూడ‌దు..?

    • బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్

    • కొత్త ఏడాదికి వాట్సప్‌ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు

    Trending News

      • కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!

      • రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

      • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

      • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

      • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd