Amaravati Relaunch : మోడీ నోటి వెంట ‘NTR’ పేరు..ఇది కదా కావాల్సింది !
Amaravati Relaunch : సభా వేదికపై ఎన్టీఆర్ (NTR) పేరును మూడు సార్లు ప్రస్తావించడం రాజకీయంగా, ప్రజల భావోద్వేగాల పరంగా పెద్ద సంఘటనగా మారింది
- By Sudheer Published Date - 10:45 AM, Sat - 3 May 25

అమరావతి రాజధాని పునఃప్రారంభ (Amaravati Relaunch) కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), సభా వేదికపై ఎన్టీఆర్ (NTR) పేరును మూడు సార్లు ప్రస్తావించడం రాజకీయంగా, ప్రజల భావోద్వేగాల పరంగా పెద్ద సంఘటనగా మారింది. ఇప్పటివరకు బహిరంగంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడని మోదీ, ఈ సారి మాత్రం “ఎన్టీఆర్ గారు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్నారు. ఆ కలలను ఇప్పుడు మనం కలసి నెరవేర్చాలి” అంటూ ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు సభలో ఉన్న ప్రజలను ఉత్సాహపరిచాయి, ఎన్టీఆర్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.
Repairability Index : ఫోన్లు, ట్యాబ్‌లకు ‘రిపేరబిలిటీ ఇండెక్స్’.. మనకు లాభమేంటి ?
ఈ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబుకు రాజకీయంగా మద్దతు లభించిందని అనుకోవచ్చు. ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. మోదీ నోటి నుంచి స్వయంగా ఎన్టీఆర్ పేరు రావడంతో, ఇప్పుడు ఆ అవకాశానికి బలం చేకూరిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అందించిన రాజకీయ సేవలు, సాంఘీక సంక్షేమ పథకాలు, అప్పటి కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమాలు దేశ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశాయి.
తమిళనాడుకు నీటి సరఫరా చేయడం మొదలుకొని, కేంద్రంలో కాంగ్రెస్ వ్యతిరేకతకు మొట్టమొదటి ప్రత్యామ్నాయంగా టీడీపీని ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే చెందింది. ఇటువంటి నాయకుడికి భారతరత్న ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలుగువారికి ఇచ్చే గౌరవంగా భావించవచ్చు. మోదీ తాజా వ్యాఖ్యలు ఆ దిశగా తొలి అడుగుగా భావించాల్సిన సమయం ఇది. చంద్రబాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఎన్టీఆర్‌కి భారతరత్న రావడం కేవలం కలగా కాకుండా నెరవేరే ఆశయంగా మారవచ్చు.