9 Year Old Girl Raped: ఏపీలో దారుణం.. బాలికను ఎత్తుకెళ్లి స్మశానంలో అత్యాచారం
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. ఓ 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి అత్యాచారం (Raped) చేశాడు. బాలిక శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో తాత వరుసైన ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు.
- Author : Gopichand
Date : 03-01-2023 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. ఓ 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి అత్యాచారం (Raped) చేశాడు. బాలిక శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో తాత వరుసైన ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆదివారం ఉదయం కూతురి పరిస్థితి గమనించిన తల్లి ఘటనపై ఆరా తీసింది. బాలిక భయపడిపోయి అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వీరఘట్టం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read: Leopard Attacks: వారిపైకి దూకిన చిరుతపులి.. వీడియో వైరల్
ఆదివారం రాత్రి 7 గంటలకు వీరఘట్టం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బయటకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన గౌరునాయుడు (48) అనే వివాహితుడు.. ఆ బాలిక కోసం దగ్గరలో మాటు వేశాడు. చిన్నారి బయటికి రాగానే బలవంతంగా పట్టుకుని అక్కడినుంచి దూరంగా పలరుగులు తీశాడు. చిన్నారి అరవకుండా గట్టిగా నోరు మూశాడు. ఆ తరువాత చిన్నారిని పక్కనున్న స్మశానంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అటువైపు స్థానికులు వెళ్లడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెళ్లి చూడగా చిన్నారి మీద అత్యాచారం జరిగింది. దీంతో చిన్నారిని పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మీద పోక్సో కేసు నమోదు చేశారు.