HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Credit For Increasing Pensions Belongs To Chandrababu Mlc Anuradha

Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

  • Author : Vamsi Chowdary Korata Date : 01-06-2026 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The credit for increasing pensions belongs to Chandrababu: MLC Anuradha.
The credit for increasing pensions belongs to Chandrababu: MLC Anuradha.

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పోరంకి సుగాలి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా వృద్ధాప్య పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వృద్ధులతో ముచ్చటించిన అనురాధ… ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న మార్పులను వివరించారు. రాష్ట్ర బడ్జెట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను ఒకేసారి రూ.3,000 నుండి రూ.4,000లకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 64 లక్షల మందికి పైగా వృద్ధులు, అర్హులు ఈ పెరిగిన పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కేవలం వృద్ధులకే కాకుండా, దివ్యాంగుల కేటగిరీల ఆధారంగా పెన్షన్లను రూ.6,000, రూ.10,000, రూ.15,000లకు పెంచి ప్రభుత్వం తమ మానవీయతను చాటుకుందని స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పెన్షన్‌ను కేవలం రూ.1,000 మాత్రమే పెంచిందని, వారికి వృద్ధుల సంక్షేమంపై నిజమైన పట్టింపు లేదని పంచుమర్తి అనురాధ విమర్శించారు. అందుకు భిన్నంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా పెన్షన్లు పెంచి చూపించిందన్నారు. పెనమలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu Naidu
  • NTR Bharosa pensions
  • Panchumarthi anuradha
  • Pension Hike
  • TDP Government

Related News

CBN

CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తుని నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే రోజని, విధ్వంసక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిన రోజుగా గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, ప్రస్తుతం కూట

  • Lakshmi Parvathi Sensational Allegations Against TDP

    Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

Latest News

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • Ponnam prabhakar: పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం

  • Back To School: బ్యాక్ టు స్కూల్.. పాఠశాలకు వెళ్లమని మీ పిల్లలు మారం చేస్తే..!

  • BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd