Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ
‘ధార్’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం.
- By Pasha Published Date - 08:55 AM, Tue - 11 February 25

Dhar Robbery Gang : ధార్ దొంగల గ్యాంగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివేట్ అయింది. వేసవి కాలం పూర్తయ్యే వరకు ఈ గ్యాంగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి జాతీయ రహదారులకు పక్కన ఉండేే గ్రామాలను ఈ ముఠా టార్గెట్‌గా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా ధార్ దొంగలు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు స్కెచ్‌లు గీస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ ముఠా ఏపీలోని అనంతపురం జిల్లాలో యాక్టివిటీ నిర్వహించింది. ఈ గ్యాంగ్‌లోని కొందరిని ఇటీవలే అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముఠా ఎక్కడిది ? దొంగతనాలు ఎలా చేస్తుంది ?
Also Read :Delhi CM : ఢిల్లీకి మహిళా సీఎం.. రేసులో ఉన్నది వీరే
‘ధార్’ ముఠా ఎక్కడిది ? దొంగతనాలు ఎలా చేస్తుంది ?
- ‘ధార్’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం. ఇక్కడి మారుమూల గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు దరు దొంగతనాన్నే ప్రొఫెషన్‌గా ఎంచుకుంటారు.
- వీరు ఏడాదిలో దాదాపు 8 నెలలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తుంటారు.
- కేవలం మూడు నుంచి నెలలుగా దొంగతనాల కోసం తెగబడుతుంటారు.
- పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ధర్ ప్రాంతంలో ఉన్న దొంగలను పట్టుకోవడానికి వెళితే.. ఆయా గ్రామాలు ఏకమై దాడులు చేయడానికీ వెనుకాడవు. అందుకే ధార్ దొంగలను పట్టుకోవాలంటే పోలీసులు వెనుకడుగు వేస్తుంటారు.
- చోరీ చేసే సమయంలో ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీసేందుకు ధార్ ముఠా దొంగలు వెనుకాడరు.
- ధార్ గ్యాంగ్ సభ్యులు ఒంటరిగా దొంగతనాలకు వెళ్లరు. కనీసం ముగ్గురు ఉండేలా టీమ్ ఏర్పాటు చేసుకొని దొంగతనానికి వెళ్తారు.
- దొంగతనాలు చేసి రైళ్లు, బస్సులు, టూవీలర్స్ ద్వారా వేరే ఏరియాలకు పరార్ అవుతారు.
- తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటారు.
- ఏదైనా ఇంటిని/దుకాణాన్ని టార్గెట్‌గా చేసుకుంటే, ముందుగా పగలంతా రెక్కీ చేస్తారు. రాత్రి టైంలో తమ గ్యాంగ్‌తో చోరీచేస్తారు.
- ధార్ గ్యాంగ్‌లోని వాళ్లకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు అవుతాయి. వీరికి చాలా వ్యసనాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి డబ్బు అవసరం. ఈజీగా డబ్బును సంపాదించే ప్రయత్నంలోనే దొంగతనాలు చేస్తుంటారు.
- చోరీలకు పాల్పడే ముందు పోలీసులకు దొరకకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
- ఈ దొంగలు సెల్ ఫోన్ వాడరు.
- ముఖాలు కనిపించకుండా జాగ్రత్తపడుతారు.
- ముసుగు వేసుకొని రాత్రి సమయాల్లో చోరీలు చేస్తారు.
- ధార్ ముఠా దొంగలు తాము చోరీ చేసిన బంగారాన్ని ఎలాంటి తూకం వేయించకుండానే అమ్మేస్తారు. కొనుగోలు చేసేవారు ఎంత ఇచ్చినా తీసుకుంటారు.