Birthday Celebrations : ఆ వార్త నన్ను మనస్థాపానికి గురి చేసింది : నారా లోకేశ్
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను.
- By Latha Suma Published Date - 04:41 PM, Fri - 24 January 25

Birthday Celebrations : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా, ఉపాధ్యాయులు చిన్నారులతో కలిసి “హ్యాపీ బర్త్‌డే లోకేష్ సార్” అంటూ పేరు కూర్పులో కూర్చోబెట్టారు. అయితే దీనిపై మంత్రి లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. “రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వారిని కోరుతున్నాను” అంటూ లోకేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
I happened to see this. My heartfelt gratitude for the warm birthday wishes from each one of the tiny tots.
However, I request the school management not to make children perform such gestures. Children’s time in school is valuable and should be spent in academic and… https://t.co/cVd5ir1wVU
— Lokesh Nara (@naralokesh) January 24, 2025
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ 42వ జన్మదిన వేడుకల తెలుగు తమ్ముళ్లు పండుగలా చేసుకున్నారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవి కేక్ కట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. చిలకలూరిపేటలో కార్యకర్తలు లోకేశ్ మాస్కులు ధరించి బైకు ర్యాలీ చేశారు. చీరాల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంచారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో పేదలకు బిర్యానీ పంపిణీ చేయగా, టీడీపీ నేత మహంతి వాసుదేవరావు రెండు నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. గుంటూరులో టీఎన్ఎస్ఎఫ్(TNSF) ఆధ్వర్యంలో లోకేశ్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయించారు.
Read Also: ICC Mens ODI Team: ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఇదే.. టీమిండియాకు షాక్!