HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Thalliki Vandanam 2nd List 2

Thalliki Vandanam 2nd List : రేపే ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు విడుదల

Thalliki Vandanam 2nd List : ఈ పథకంలో తమకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే పౌరులు https://gsws-nbm.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి "తల్లికి వందనం" పథకాన్ని సెలెక్ట్ చేసి, విద్యార్థి తల్లి ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి

  • Author : Sudheer Date : 09-07-2025 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thalliki Vandanam
Thalliki Vandanam

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకం రెండో విడత నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు గురువారం (జులై 10న) రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు, ఈ నెల 2వ తేదీ లోపు పాఠశాలలో చేరిన విద్యార్థుల వివరాలను పరిశీలించారు. అర్హుల జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు.

ఈ రెండో విడతలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొదటి తరగతి మరియు ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌లో చేరిన విద్యార్థుల తల్లులకు ఈ నిధులు అందజేయనున్నారు. మొదటి విడతలో అర్హత ఉండీ, ఏవో సాంకేతిక కారణాలతో నిధులు జమ కాకపోయిన వారికి ఈ విడతలో మరో అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నవారు, ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన వారు – ఈ విడతలో నిధులు పొందనున్నారు.

Second Hand Cars : సెకండ్ హ్యాండ్ కార్స్ కొనడం వల్ల లాభాలు , నష్టాలు ఇవే !!

విద్యాహక్కు చట్టం కింద ప్రవేశం పొందిన సుమారు 46 వేల మంది విద్యార్థులకు నిధులు వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలల ఖాతాలకు జమ చేయనున్నారు. మొత్తం మీద 11 లక్షల మందికి పైగా విద్యార్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించి సచివాలయ శాఖకు పంపింది. అందులోని అర్హుల వడపోత అనంతరం 10 లక్షల మందికి పథకం అమలు కానుంది. ఇదివరకే జూన్ 12న మొదటి విడత నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, ఈసారి జులై 10న మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ సందర్భంగా రెండో విడత నిధుల విడుదలను నిర్ణయించింది.

ఈ పథకంలో తమకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే పౌరులు https://gsws-nbm.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి “తల్లికి వందనం” పథకాన్ని సెలెక్ట్ చేసి, విద్యార్థి తల్లి ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. అలాగే మనం మిత్రం వాట్సాప్ నంబర్ +91 9552300009 ద్వారా కూడా అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునే సౌలభ్యం కల్పించారు. ఇది ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేస్తూ, మరింత మందికి ప్రయోజనం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • Thalliki Vandanam
  • Thalliki Vandanam 2nd list
  • thalliki vandanam amount check

Related News

Adulterated Ghee Issue.. Ysrcp Faces Setback In Supreme Court

కల్తీ నెయ్యి వ్యవహారం .. వైఎస్సార్‌సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరుమల లడ్డూలో రసాయనాల కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

  • Jagan App

    AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

Latest News

  • ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్ .. అదనంగా మరో 2 లక్షలు మంజూరు ..!

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd