HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tension Situvation In Andhra Telangana Border

CBN : ఛ‌లో రాజ‌మండ్రికి సిద్ధ‌మైన ఐటీ ఉద్యోగులు..ఆంధ్ర తెలంగాణ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఐటీ ఉద్యోగులు క‌దంతొక్కుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌, బెంగుళూరు, చెన్నైలో

  • Author : Prasad Date : 24-09-2023 - 10:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN
CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఐటీ ఉద్యోగులు క‌దంతొక్కుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌, బెంగుళూరు, చెన్నైలో బాబుకు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌లు చేసిన ఐటీ ఉద్యోగులు మ‌రో అడుగుముందుకు వేశారు. ఛ‌లో రాజ‌మండ్రి అంటూ హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కు భారీ కార్ల ర్యాలీని నిర్వ‌హించనున్నారు. ఈ రోజు (ఆదివారం) తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు కార్ల ర్యాలీ ప్రారంభ‌మైంది. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి దివంగ‌త న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న స‌తీమ‌ణి నంద‌మూరి అలేఖ్య‌రెడ్డి, పిల్ల‌లు సంఘీభావం తెలిపారు.

ఇటు ఆంధ్రా-తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ నేప‌థ్యంలో విజ‌య‌వాడ క‌మిష‌రేట్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా పోలీసులు బోర్డ‌ర్ లో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే ప్ర‌తి వాహ‌నాన్ని పోలీసులు క్షుణంగా త‌నిఖీ చేస్తున్నారు. వాహ‌నాల్లో వచ్చే ప్ర‌యాణికుల వివ‌రాలు అడిగి తెలుసుకున్న త‌రువాతే వారిని అనుమ‌తిస్తున్నారు. 500 మందిపైగా పోలీసుల‌తో స‌రిహ‌ద్దు వ‌ద్ద బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో కార్ల ర్యాలీని అడ్డుకోవాల‌ని పోలీసులు చూస్తున్నారు. ఇటు ఐటీ ఉద్యోగ‌లు మాత్రం రాజమండ్రికి చేరుకుని తీరుతామ‌ని తేల్చి చెప్తున్నారు. అయితే హైద‌రాబాద్ నుంచి ఆంధ్రా స‌రిహ‌ద్దు వ‌ర‌కు తెలంగాణ పోలీసులు ఎటువంటి ఆంక్ష‌లు పెట్ట‌లేదు. కేవ‌లం ఏపీలోనే ఎందుకు ఆంక్ష‌ల‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbn
  • chandrababu
  • hyderabad
  • I am with CBN
  • IT Employees
  • rajamundry

Related News

Srh Klassen

IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

క్లాసెన్ ప్రదర్శనపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. "క్లాసెన్ ఫ్యాన్స్ కు దేవుడయ్యాడు" అంటూ పోస్ట్‌లు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాడు

  • Chandrababu Naidu

    TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

  • Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • GST : ఏప్రిల్ GST వసూళ్లలో రికార్డ్

  • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

  • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd