HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Telangana It Minister Sridhar Babu Appreciate Cm Chandrababu

Davos Tour : దావోస్‌లో చంద్రబాబు వ్యూహాన్ని బయటపెట్టిన శ్రీధర్ బాబు

Davos Tour : ఏపీ ఒప్పందాలు చేసుకుని వాటిని ఇంకా ప్రకటించకూడదనే వ్యూహంతోనే చంద్రబాబు వ్యవహరించారని ఆయన వెల్లడించారు

  • Author : Sudheer Date : 29-01-2025 - 4:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Great
Cbn Great

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దావోస్‌(Davos)లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు(World Economic Forum conference)లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మంత్రివర్గ సభ్యులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా ఆయనతో కలిసి వెళ్లారు. పెట్టుబడులు రాబట్టడం ప్రధాన ఉద్దేశ్యంగా వెళ్లినప్పటికీ, ఏపీ టీమ్ పెద్దగా ఒప్పందాలు పొందలేదంటూ వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ విమర్శల గురించి చంద్రబాబు & టీమ్ పెద్దగా పట్టించుకోవడం లేదు.

దావోస్ పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. అక్కడ రెండు రాష్ట్రాల బృందాలు కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించగా, ఏపీ ఖాళీగా తిరిగొచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కీలక విషయాలు వెల్లడించారు. ఏపీ ఒప్పందాలు చేసుకుని వాటిని ఇంకా ప్రకటించకూడదనే వ్యూహంతోనే చంద్రబాబు వ్యవహరించారని ఆయన వెల్లడించారు.

Hardik Pandya: హార్దిక్ పై మండిపడ్డ టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్

శ్రీధర్ బాబు తెలిపిన ప్రకారం.. “ఏపీకి గ్లోబల్ కేపబిలిటీ ఉంది. చంద్రబాబుది బ్రాండ్ మెంటాలిటీ. ఆయన బ్రాడ్ థింకింగ్‌తో దావోస్‌కు వచ్చారు. ఏపీకి ఉన్న సముద్రతీరం, వనరులు పరిశ్రమల ఆకర్షణకు ముఖ్యమైనవి. ఏపీ ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది, కానీ వాటిని దావోస్‌లో బయటపెట్టడం లేదు” అని పేర్కొన్నారు. అంతేకాదు, లోకేశ్‌ను దీనిపై ప్రశ్నించగా, “ఈ ఒప్పందాల ప్రకటనలను ఏపీలోనే చేస్తాం” అని ఆయన చెప్పినట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు.

ఇక దావోస్‌లోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి కూడా శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైనస్ 8 నుంచి మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రతలలో తాము స్వెట్టర్లు వేసుకున్నప్పటికీ, చంద్రబాబు సాధారణ డ్రెస్సులోనే ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. 70 ఏళ్లు దాటినా చంద్రబాబు ఈ స్థాయిలో ఫిట్‌గా ఉండడం నిజంగా గమనించదగ్గ అంశమని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Davos
  • Telangana IT Minister Sridhar Babu

Related News

Manoj Babu

Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

పిల్లల ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశలో వారిని అనవసరమైన సామాజిక ఒత్తిళ్ల నుండి కాపాడటం సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత అని మంచు మనోజ్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఆటపాటలకు దూరమై

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd