MLC Election Results : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ
MLC Election Results : మొత్తం ఐదు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు
- By Sudheer Published Date - 01:53 PM, Tue - 4 March 25

ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మొత్తం ఐదు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా వైఎస్ జగన్ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లో కూడా టీడీపీ తన గెలుపు జెండా ఎగురవేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు రికార్డు స్థాయిలో మెజారిటీ రావడం విశేషంగా మారింది. ప్రత్యేకంగా ఒక నియోజకవర్గంలో 89,000 ఓట్ల భారీ ఆధిక్యత సాధించడం భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘటనగా చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే, టీడీపీ మద్దతు భారీగా పెరగడం, ముఖ్యంగా పట్టభద్రుల ఓటు పూర్తిగా టీడీపీ వైపు చేరడం గమనార్హం. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతకు ప్రతిబింబంగా భావిస్తున్నారు.
Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఓటు శాతం 10% పెరగడం విశేషంగా మారింది. 2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మరింత ప్రజాదరణ పెరిగిందని, ప్రజల్లో మార్పు కోరుకునే ఆలోచన బలపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ పెరిగిన అసంతృప్తి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో టీడీపీకి పెరిగిన మద్దతే ఈ భారీ విజయం వెనుక ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి గట్టి హెచ్చరికగా మారాయి. ప్రజలు వైసీపీ విధానాలతో విసుగు చెంది, కూటమి ప్రభుత్వం పై మరింత నమ్మకాన్ని పెంచుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మేధావులైన పట్టభద్రులు, ఉద్యోగ వర్గాలు వైసీపీపై తిరుగుబాటు చేసినట్టు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ ఫలితాల ప్రభావం రాబోయే ఎన్నికల్లోనూ తీవ్రంగా కనిపించొచ్చని, టీడీపీ-జనసేన కూటమి మరింత బలపడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Drugs : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ ?