HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Senior Leader Somireddy Chandramohan Reddy Alligations On Ysrcp Leaders

Nellore TDP vs YCP : కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి

కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా మారిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. జిల్లా పౌర

  • Author : Prasad Date : 16-10-2022 - 7:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Somireddy
Somireddy

కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా మారిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. జిల్లా పౌర సర‌ఫ‌రాల సంస్థ‌లో జ‌రిగిన భారీ కుంభ‌కోణంలో జిల్లా మంత్రి హ‌స్తం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. మంత్రులకు వాటా లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగే ప్రసక్తే లేదని ఆయ‌న అన్నారు. రెండున్నరేళ్లలో ఆ శాఖను పర్యవేక్షించే నలుగురు జేసీలను మార్చేయడం కూడా కుంభకోణంలో భాగమేన‌ని సోమిరెడ్డి ఆరోపించారు. జిల్లా మంత్రి ఆశీస్సులతోనే కృష్ణపట్నం ఓడరేవు మీదుగా రేషన్ బియ్యం ఎగుమతులు జ‌రుగుతున్నాయ‌ని.. ఆస్ట్రేలియా నుంచి వచ్చే ప్రతినిధులకు ఆర్బీకేల కేంద్రంగా జరుగుతున్న అవినీతిని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రైతుల కోసమే బతుకుతున్నాం…ప్రతి గింజా కొంటామని జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి సమీక్షలు పెట్టడం కాదని..ఈ కుంభకోణాల గురించి తేల్చండని ఆయ‌న డిమాండ్ చేశారు. క్రైమ్ కమ్ కరెప్షన్ కేపిటల్ గా నెల్లూరును నాలుగో రాజధానిగా ప్రకటిస్తారేమోన‌ని ఆయ‌న అన్నారు. నెల్లూరు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో రెండున్నరేళ్లలో రూ. 29.78 కోట్లు కుంభకోణం జరిగిందని ఉన్నతాధికారులే తేల్చారని.. ప్రతి నెలా కోట్లకు కోట్లు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు.

ఇంత భారీ కుంభకోణం జరుగుతున్నా జిల్లా మంత్రి కానీ, ఇంఛార్జ్ మంత్రి కానీ, పౌరసరఫరాల శాఖ మంత్రి కానీ నోరుతెరవకపోవడమే అందుకు నిదర్శనమ‌న్నారు. చినచిన్నోళ్లను 11 మందిని సస్పెండ్ చేసి, కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని.. ఈ రూ.29.78 కోట్లలో మెజార్టీ వాటా జిల్లాకు చెందిన ఓ పెద్దమనిషికి చేరిందని తెలుస్తోందన్నారు. జిల్లా మంత్రికి మేజర్ వాటా ఉందని తెలియడంతో ఇంఛార్జ్ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి నోరు మెదపడం లేదని ఆయ‌న ఆరోపించారు. రెండున్నరేళ్లుగా మిల్లింగ్ చార్జీలు రూ.240 కోట్లు, ఈ క్రాఫ్ బుకింగ్ లో ఫ్రాడ్ జరిగిందని రైతులకు రూ.100 కోట్లు చెల్లించకుండా ఆపేశారన్నారు. పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన కమిషన్ రూ.5 కోట్లు, హమాలీలకు రూ.10 కోట్లు చెల్లించలేదని సోమిరెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం విషయంలోనూ భారీ కుంభకోణం జరుగుతోందని…లబ్ధిదారుల వద్ద కిలో రూ.10కి బియ్యం కొనుగోలు చేసి కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు తరలించి వందల కోట్లు సంపాదిస్తున్నార‌ని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టులోనూ జిల్లాలోని పెద్దమనిషి దందా సాగుతోందని..ముత్తుకూరు, వెంకటాచలం, కృష్ణపట్నం పోలీసులకు చేతులు తడిపి ఆ పెద్దమనిషి ఆశీర్వాదం తీసుకుని బియ్యాన్ని ఓడల్లోకి ఎక్కిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో వందల కోట్ల కుంభకోణాలు, అక్రమాలు జరుగుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Ministers
  • civil supply corporation
  • cm jagan
  • Nellore
  • somireddy chandramohan reddy
  • tdp
  • ysrcp

Related News

NRI TDP

NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

అమెరికాలోని తెలుగువారికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండగలగడం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులలో చేయగల ప్రజాసేవ కంటే ప్రవాసాంధ్రులకు సేవలందించగల ఈ పదవి ఎంతో తృప్తి ఇస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన నమ్మకాన

  • AP CM Chandrababu

    CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Air Trunk Campus to be Established in Visakhapatnam! — Minister Nara Lokesh

    Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • CBN

    CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

Latest News

  • JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • Ponnam prabhakar: పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd