HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Sc Cell President Ms Raju Comments On Home Minister

Andhra Pradesh : హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదా..?

ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్ఎస్ రాజు ఆరోపించారు. రాష్ట్రంలో

  • Author : Prasad Date : 16-11-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్ఎస్ రాజు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడి జరగని రోజు లేదని.. అసాంఘిక శక్తులు మొదలు కొని పోలీసులు దాక అనునిత్యం ఏదో ఒక రూపంలో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారని ఆయ‌న ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, దొమ్మెరుకు చెందిన దళిత యువకుడు బొంత మహింద్రను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి దాడికి పాల్పడ్డారన్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మహీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని ఎమ్ఎస్ రాజు తెలిపారు. దళితులంటే వైసీపీ నాయకులకు, పోలీసులకు లెక్కలేకుండా పోయిందన్నారు. దీనంతటికీ కారణం సీఎం జగన్ రెడ్డి ఉదాసీన వైఖరేన‌ని.. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు నిత్యకృత్యంగా జరుగుతూ ఉన్నా చర్యలు శూన్యమ‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మొన్న నందిగామలో శ్యామ్ పై జగన్ సామాజికర్గానిక చెందిన యువకులు మూత్ర విసర్జన చేసి అవమానించారని.. దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించి పార్టీ సభలు, సమావేశాల్లో జగన్ తన పక్కనే తిప్పుకుంటున్నారన్నారు. సీఎం సొంత నియోజకవర్గ కేంద్రంలోనే దళిత మహిళ నాగమ్మ పై అత్యాచారం చేసి హత్య చేసినా చర్యలు లేవన్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలో అసలు నిందితుడు వెంకట్ రెడ్డిని ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు.

Also Read:  TDP : బీటెక్ రవి అక్రమ అరెస్ట్ వైసీపీ కక్ష సాధింపు చర్య : టీడీపీ నేత బీద ర‌విచంద్ర

హోం మంత్రి దళితురాలై ఉండి దళితులకు ఒరిగింది ఏమిటీ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మహేంద్రను అకారణంగా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని, విడిపించాలని మహేంద్ర కుటుంబ సభ్యులు వైసీపీ పెద్దలను ప్రాధేయపడినా కనికరించలేదని.. వైకాపా దళిత మంత్రులు ఉన్నది జగన్ రెడ్డికి బాకా ఊదడానికా? లేక ప్రజలను రక్షిచడానికా? అని ప్ర‌శ్నించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 28 మంది దళితులను పొట్టనబెట్టుకున్నారని.. ఆరు వేల మంది దళితులపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపైన్నే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. విదేశీ విద్య, ఎన్టీయార్ స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవలబుల్ స్కూల్స్ వంటివాటిని రద్దు చేసి దళితులు విద్యా పరంగా ఎదగకుండా అడ్డుకున్నారని ఎమ్ఎస్ రాజు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులు, రాజ్యసభ సభ్యుల నియామకంలో దళితులకు అన్యాయం చేశారని.. సలహాదారులుగా దళితులు పనికిరారంటూ అసెంబ్లీ సాక్షిగా దళిత జాతిని జగన్ అవమానించారన్నారు. దళితులను అన్ని విధాల వేధిస్తున్న జగన్ రెడ్డికి దళితులు బుద్ది చెప్పాలని ఎమ్ఎస్ రాజు పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap home minister
  • cm jagan
  • MS Raju
  • tdp
  • TDP SC cell
  • ysrcp

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd