TDP : ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై వాస్తవాలను వివరించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు.. వైసీపీ ప్రభుత్వం..?
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై చట్టసభల్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికోడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు,
- By Prasad Published Date - 04:52 PM, Tue - 26 September 23

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై చట్టసభల్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికోడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దానిపూ చర్చ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం ఎమ్మెల్సీలు మాక్ మండలి నిర్వహించి, ప్రాజెక్ట్ కు సంబంధించిన వాస్తవాలను ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచారు. రూ.149లకే నాడు టీడీపీప్రభుత్వం ప్రతి ఇంటికీ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం దేశంలోనే గొప్ప సాంకేతిక విప్లవంగా నిలిచిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ .. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్.. లేని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్.. ఇలా ప్రతిదీ వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపుతో తెరపైకి తెస్తున్న అంశాలే తప్ప..ఎక్కడా దేనిలోనూ తప్పుజరిగినట్టు జగన్ సర్కార్ నిరూపించలేదన్నారు.

TDP
ఈ ప్రాజెక్ట్ అమలుకోసం తొలుత ప్రైస్ వాటర్ కూపర్ సంస్థ అధ్యయనం చేసి, మొత్తం ఏపీ అంతటా అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి రూ.5,600కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసిందని తెలిపారు. దాంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రప్రభుత్వం దాన్ని ఎలా అమ లు చేయాలా అని ఆలోచించిందని.. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు కేబుల్ వేయడా నికి అంత ఖర్చుపెట్టాల్సిన అవసరంలేదని, ఇప్పటికే ఉన్న విద్యుత్ స్తంభాల మీదు గా కేబుల్ తీసుకెళితే, తక్కువఖర్చుతో పూర్తవుతుందని చెప్పారని తెలిపారు. ఆయన ఆలోచన ప్రకారమే నాటి ప్రభుత్వం కేవలం రూ.330కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా ప్రాజెక్ట్ అమలుచేసిందన్నారు.
ప్రాజెక్ అమలును ఇన్ క్యాప్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు అప్పగించారని.. టీవీ కనెక్షన్, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ ను కేవలం రూ.149లకే నాటి ప్రభుత్వం అందించడం నిజంగా గొప్ప సాంకేతిక విప్లవమనే చెప్పాలన్నారు. దాదాపు 5 వేల గ్రామాలను కలుపుతూ 24 వేల కిలోమీటర్ల వరకు కేబుల్ వేయడం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ వేస్తే రూ.5,600కోట్లు అవుతుందన్న ప్రాజెక్ట్ ను, ఏపీ ప్రభుత్వం కేవలం రూ.330కోట్లతో పూర్తిచేయడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని తెలిపారు