HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mlas Comments On Cm Jagan Mohanreddy

TDP MLA’s : వైసీపీ పుట్టింది ములాఖత్ లు.. మిలాఖత్‌ల నుంచే : టీడీపీ ఎమ్మెల్యేలు

చంద్రబాబునాయుడిని పవన్ కల్యాణ్ కలిస్తే దానిపై ముఖ్యమంత్రి స్పందించ‌డం విడ్డూరంగా ఉంద‌ని టీడీపీ ఎమ్మెల్యేలు

  • Author : Prasad Date : 21-09-2023 - 3:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

చంద్రబాబునాయుడిని పవన్ కల్యాణ్ కలిస్తే దానిపై ముఖ్యమంత్రి స్పందించ‌డం విడ్డూరంగా ఉంద‌ని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. జ‌గ‌న్ ములాఖత్ లో మిలాఖత్ అంటూ మాట్లాడ‌టం చూస్తే ఆయనకు ఆలోచనా శక్తి తగ్గిందనే అనుమానం కలుగుతుంద‌న్నారు. ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి గతం గుర్తుచేసుకోవాల‌ని.. ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు ఎన్ని మిలాఖత్ లు అయ్యాయో గుర్తు చేసుకోవాల‌న్నారు. వైసీపీ పుట్టుక మొదలైందే ములాఖత్ లు.. మిలాఖత్ లతో కదా! అని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఆ విషయం మర్చిపోయి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మాట్లాడ‌టం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు ఉంద‌న్నారు. జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ఎవరితో ఎప్పుడు ములాఖత్ అయ్యి.. మిలాఖత్ లు జరుపుతున్నారో తెలియదా? ఆయనపై ఉన్న కేసుల విచారణ ఆగిపోవ డానికి ఏ ములాఖత్ లు.. ఏ మిలాఖత్ లు కారణమో ఆయనే చెప్పాలన్నారు.

అధికారపార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి, బహిరంగసభకు తేడా తెలియకపోతే ఎలా? వారు మాట్లాడే దానికంటే మేం గట్టిగానే పాయింట్లు మాట్లాడగలమ‌ని.. కానీ సమయం … సందర్భం చూస్తున్నామ‌న్నారుఉ. వీళ్లెన్ని చెప్పినా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎక్కడా రూపాయి కూడా పక్కకు పోలేదని..పక్కకు పోనప్పుడు అది చంద్రబాబుకో, మరొకరికో వచ్చే అవకాశమే లేదు. ఫలానా రూపాయి .. ఫలానా దగ్గరకు పోయి.. ఫలానా చోటకు చేరిందని ఈ రోజుకి నిరూపించలేకపోయారని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఎవరైనా ఆధారాలుంటే అరెస్ట్ చేస్తారు… కానీ అరెస్ట్ చేశాక ఆధారాలు చూపిస్తామని నిస్సిగ్గుగా కోర్టులకు చెప్పడం వీళ్లకే చెల్లింద‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh TDP
  • ap assembly
  • cm jagan
  • MLAs
  • tdp mlas
  • ycp

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd