HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mla Sambasivarao Comments On Ycp Goverment

TDP : అధికారం కోసం వైసీపీ అడ్డ‌దారులు తొక్కుతుంది – టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఓటర్ లిస్టుల్లో అనేక అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి

  • Author : Prasad Date : 24-10-2023 - 5:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP Yeluri
TDP Yeluri

వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఓటర్ లిస్టుల్లో అనేక అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. అధికారం కోసం అడ్డ‌దారులు తొక్కుతుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్రభుత్వపు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనపై ప్రజలు విసిగి పోయార‌ని.. సామాన్య ప్రజలు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు ఆరోపించారు. ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వానికి ఓటు వేయరో వారిని ఓటర్ లిస్టు నుండి వారి పేర్లను తొలగించడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అందుకు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థలోని వాలంటీర్లను వాడుకుంటోంద‌న్నారు. వ్యతిరేకుల ఓట్లు తొలగించేందుకు కుంటి సాకులు చూపుతున్నారని.. పేర్లు తొలగించేందుకు ఉపయోగించే ఫామ్ 7ని బల్క్ గా అప్ లోడ్ చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల బీఎల్ ఓలను బెదిరించి ఓట్లు తొలగిస్తున్నారని.. కొందరు అధకారులను భయపెట్టడం, బెదిరించడం లేక పోస్టింగులు ఇస్తామని ఆశ చూపడం జరుగుతోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయిన రోజు నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లను తొలగించే పని అధికమైందన్నారు. ప్రస్తుతం ఓటర్ లిస్టు సవరణలు జరుగుతున్నాయని.. ఇందులో ఇప్పటి వరకు 7 లక్షల 60వేల ఫామ్ 7 లు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేస్తే కేవలం చంద్రబాబునాయుడుగారు అరెస్టు అయినప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 8 నుంచి 15వ తేది వరకు అంటే వారం రోజుల్లో 2 లక్షల 44 వేల 551 ఫామ్ 7 లను వీరు అప్ లోడ్ చేశారన్నారు. చంద్రబాబు ను అరెస్టు చేశారని రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తుంటే ఆ సమయంలో అధికారులను అడ్డం పెట్టుకొని 2 లక్షల 44 వేల మంది ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ నాలుగు నెలల్లో కొత్త ఓట్ల ఎన్ రోల్ మెంట్ లో సుమారు 6 లక్షల 80 వేల ఓట్లు నమోదు చేసుకోవడానికి అప్లై చేస్తే కేవలం చంద్రబాబు అరెస్టు అయిన వారంలో లక్షా 20 వేల 44 ఓట్లు కొత్తగా ఎన్ రోల్ చేశారన్నారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసివేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అనుమానం ఉన్న వారి ఓట్లు తీసివేయటం జరిగిందన్నారు.

Also Read:  IKEA : బ్యాగ్‌కు రూ.20 వ‌సూలు చేసిన ఐకియా.. షాక్ ఇచ్చిన వినియోగ‌దారుల కోర్టు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • cm jagan
  • tdp
  • TDP MLA Yeluri sambasivarao
  • ysrcp

Related News

Telangana government good news for Anganwadi helpers

Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంధ్యా రాణి ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ఆయా (అంగన్వాడీ హెల్పర్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు

  • Avinash Reddy faces setback in Supreme Court

    వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

    కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

Latest News

  • Hyderabad : హైదరాబాద్‌లోని పేదలకు గుడ్‌న్యూస్

  • AI : ప్రాజెక్ట్ రంగంలో ‘ఏఐ విప్లవం’

  • Trump Tariffs : టారిఫ్లపై ట్రంప్ కీలక ప్రకటన

  • AC Price Hike : ఏసీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • Rape : బాలికను అత్యాచారం చేసిన జ్యోతిషుడు

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd