AP : టీడీపీ నేత నక్కా ఆనందబాబు హౌస్ అరెస్టు
- By Latha Suma Published Date - 10:50 AM, Thu - 16 May 24

Nakka Anandababu : టీడీపీ(TDP) పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్టు(House arrested) చేశారు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఈరోజు మాచర్ల(Macherla)లో టీడీపీ అధ్యయన కమిటి పర్యటించాల్సింది..ఉంది.ఈ మేరకు ఐదుగురు సభ్యుల కమిటీలో నక్కా ఆనందబాబు కూడా ఒకరు. దీంతో నేడు టీడీపీ బందం మాచర్ల వెళ్లాలని భావించిన నేపథ్యంలో ఆయన్ను పోలిసులు హౌస్ అరెస్టు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పల్నాడు లో 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నాయకుల మాచర్ల పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్ అయ్యారు.
Read Also: Sunil Chhetri: రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
ఇక అటు అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసిపి నేతల ఇండ్ల పై జరిగిన దాడులపై అప్రమతమయ్యారు పోలీసులు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.