TDP vs YCP : జగన్ రెడ్డి చేతగానితనం వల్లే కృష్ణా జలాల్లో ఏపీకి అన్యాయం – తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర
- By Prasad Published Date - 08:25 PM, Thu - 5 October 23

జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన అవినీతి దోపిడీ కోసం ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని..కృష్ణాజలాల్లో న్యాయంగా ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన నీటివాటాకు సంబంధించి గతంలో బచావత్ ట్రైబ్యునల్ నిబంధనలు ఏవీ అమల్లోకి రాలేదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణాజలాల కేటాయింపులకు సంబంధించి తొలుత బచావత్ ట్రిబ్యునల్ వేశారని.. ఆ బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల కృష్ణా నీటిని కేటాయించారని గుర్తుచేశారు. ఈ కేటాయింపుల అనంతరం కృష్ణానది మిగులుజలాలపై తమకు వాటా కావాలని కర్ణాటక రాష్ట్రం వాదన మొదలు పెట్టిందని.. అంతర్జాతీయ నదీజలాల ఒప్పందం ప్రకారం నదీపరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలు వరదల ప్రభావానికి కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మిగులు జలాలు వినియోగించుకునే హక్కు వాటికే ఉంటుందని నిర్ధారించారని తెలిపారు. ఆ ప్రకారం కృష్ణా మిగులు జలాల విని యోగంపై తెలంగాణ, ఏపీకి మాత్రమే హక్కు ఉందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణాజలాల్లో 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటా యిస్తూ ఆనాడు అపెక్స్ కౌన్సిల్ తీర్మానించిందన్నారు. ఆ ప్రకారం కొన్నాళ్లుగా నీటి వినియోగం కూడా జరుగుతోంది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఈ వ్యవహారంపై వింతవాదన మొదలెట్టిందని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతం ఏపీకంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది కాబట్టి.. మిగులు జలాల్లో తమరాష్ట్రానికి ఎక్కువ కేటాయించాలనేదే తెలంగాణ వాదనని.. ఈ వాదన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల్లో ఉండే నీటినిల్వల ఆధారంగా చేసిన కేటాయింపులకు విరుద్ధంగా ఉందన్నారు. గతంలో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తెలంగాణలోని బీమా – నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల్ని, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టుల్ని నోటిఫై చేసి, వాటి ఆధారంగా కృష్ణాజలాల కేటాయింపులు చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులపై పూర్తి అధ్యయనం జరక్కముందే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా అదనపు కృష్ణా జలాల వినియోగంపై దృష్టిపెట్టిందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి.. రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి పురోగతి చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే ఇవ్వడంతో దానిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా తన స్వప్రయోజనాలకోసం జగన్ రెడ్డి మిన్నకుండిపోయారన్నారు. తెలంగాణలోని తన ఆస్తులు, భూముల్ని కాపాడుకోవడానికి ఏపీ రైతాంగానికి, ముఖ్యంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం చేయడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమయ్యారని మండిపడ్డారు.
Also Read: Telangana Pre Poll Survey 2023 : కారు స్పీడ్ కు బ్రేకులు..కాంగ్రెస్ జోరు..దరిదాపుల్లో లేని బిజెపి