TDP vs YCP : దమ్ముంటే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల సందర్శనకు వైసీపీ నేతలు రావాలి – టీడీపీ నేత బీద రవిచంద్ర
- By Prasad Published Date - 01:53 PM, Sat - 16 September 23

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రిమాండ్‌లో ఉన్నారు. అయితే అసలు స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కామే జరగలేదని టీడీపీ నేతలు అంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు వరుసగా దానిపై ప్రజెంటేషన్ ఇస్తున్నారు. 42 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల సందర్శనకు వైసీపీ మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, సాక్షి మీడియాని, వైసీపీ అనుబంధ మీడియాని స్వాగతిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవించంద్ర సవాల్ చేశారు. రండి కలిసి పర్యటిద్దాం.. అక్కడ ఉన్న వాస్తవాలను తెలుసుకుందామంటూ ఆయన వైసీపీ నేతలకి సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన సెంట్రల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ లేనే లేవంటున్నవారు ఢీల్లీకి వచ్చి నిర్ధారించుకోగలరా? అని ప్రశ్నించారు. సలహాదారుడు అజయ్ కల్లం రెడ్డి, ప్రేమ్ చంద్రారెడ్డిలతో కలిసి అన్ని సెంటర్లు తిరుగుదాం.. రాగలరా? అని సవాల్ చేశారు. కేంద్రం ఇచ్చిన సెంటర్లు లేనే లేవనడం విడ్డూరంగా ఉందని.. ఇంకా పలు వాస్తవాలను అవాస్తవాలని మాట్లాడుతున్నవారు కూడా తమతో రావాలని కోరారు.
ఈ ప్రపంచానికి రథసారధులైన యువత జీవితాలను ఈ ప్రభుత్వం బుగ్గిపాలు చేస్తోందని బీద రవిచంద్ర మండిపడ్డారు. ప్రతిభ ఉన్న యువత బతుకులను ఛిద్రం చేస్తున్నారని..ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. యువతకు బంగారు భవిష్యత్తును ఇవ్వాల్సిందిపోయి వారి అభివృద్ధికి నిరోధకులుగా వైసీపీ ప్రభుత్వం మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువతకు అండగా నిలవాల్సింది పోయి గుదిబండగా మారిందన్నారు. మేధావులు, పారిశ్రామికవేత్తలను కూడా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని… చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేయడం కరెక్టు కాదన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందని పదే పదే ప్రభుత్వం అసత్యపు ప్రచారం చేస్తోందని..స్కిల్ డెవలప్ మెంట్ కు నిధులు విడుదల కావడం అబద్ధమా? ఎక్స్ లెంట్ సెంటర్స్, ట్రైనింగ్ సెంటర్స్ 42 ఉండటం అబద్ధమా? ఈ సెంటర్స్ ని విజిట్ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీడియాతో సెంటర్స్ కు వచ్చేందుకు సిద్ధమా? అని మరోసారి సవాల్ చేశారు. ఈ సెంటర్లలో పరిరకరాలు ఉన్నాయా లేదా అని చూడటానికి వెళ్లేవారిని ఎందుకు ఈ ప్రభుత్వం అండ్డుకుంటోందని బీద రవించంద్ర ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు నిర్వహించే యూనివర్శిటీ, కాలేజీలను బెదిరిస్తున్నారని.. 42 సెంటర్ లకుసాఫ్ట్ వేర్, హార్ట్ వేర్ పరికరాలు అందాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులు అవినీతి జరగకపోయినా అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్నారని.. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ లలో భాగమైన 36 ట్రైనింగ్ డెవలప్ మెంట్ సెంటర్లు, 6 స్కిల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ లెన్సీ సెంటర్ల సందర్శనకు ప్రభుత్వాధికారులు రావాలని పిలుపునిస్తున్నామన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం లేని అవినీతి గురించి ప్రచారం చేయడం, గందరళోళం సృష్టించడం మానాలని లేదంటే భవిష్యత్తులో వీరికి ప్రజల చేతిలో ఇబ్బందులు తప్పవని బీద రవిచంద్ర తెలిపారు.