AP : జనవరి 11 న నరసరావుపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ
- Author : Sudheer
Date : 28-12-2023 - 3:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Elections) 100 రోజుల సమయం కూడా లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు (YCP-TDP-Janasena) ఎన్నికలకు సంబదించిన కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP).. తమ భ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేయగా..టీడీపీ – జనసేన పార్టీలు (TDP-Janasena) ఉమ్మడి కార్యాచరణ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటీకే ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు (Chandrababu)- పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు పలుమార్లు భేటీ అవ్వడం, పొత్తులు , అభ్యర్థుల తాలూకా వివరాలు మాట్లాడుకోవడం చేసారు. రీసెంట్ గా యువగళం సక్సెస్ సభలోను పవన్ కళ్యాణ్ హాజరై..ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే పొత్తు గురించిన ఐకమత్యం, అవగాహనను ప్రజల్లోకి , కార్యకర్తల్లోకి తీసుకెళ్లాలని ఇందుకు గాను ఇరు అధినేతలు కలిసి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నారు. ఎందుకంటే పొత్తు అనేది ఇరు పార్టీల అధినేతల్లోనూ, నేతల్లోనూ వస్తే సరిపోదు.. అందుకు గల కారణాలను ప్రజలకు వివరించాలని.. అలాకానిపక్షంలో మొదటికే మోసం వస్తుంది.. ఉన్న ఓటు బ్యాంకు కూడా పోయే ప్రమాధం ఉంది. అందుకే టీడీపీ – జనసేనలు ఇరువురు ఉమ్మడి సభలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా మూడు ప్రాంతాలైన కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర.. రాయలసీమలో సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా జనవరి 11 న నరసరావుపేట (Narasaraopet)లో భారీ బహిరంగ సభ (TDP-Janasena Joint public Meeting ) నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. ఈ సభకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు హాజరుకాబోతున్నారు. దీనికి సంబదించిన వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు.
Read Also : Praja Palana : రూ.50 , రూ.100 లకు అభయ హస్తం దరఖాస్తు పత్రాలను అమ్ముతున్న దళారులు