Perni Nani Comments : పాదయాత్ర పేరుతో టీడీపీ వసూళ్ల రాజకీయానికి తెరలేపుతోంది..!!
వైసీపీ సర్కార్ పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.
- By hashtagu Published Date - 12:52 PM, Fri - 9 September 22

వైసీపీ సర్కార్ పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. పేదలకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం తప్పా అంటూ ప్రశ్నించారు. రాజధానిలో పేదలు, బడుగులు ఉండకూడదా అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో దోచుకుని …రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు పాదయాత్ర అంటూ మళ్లీ డ్రామాలు మొదలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.
Also Read : టీఆర్ఎస్ నేతలు గొర్రెలతో సమానం…గవర్నర్ ప్రొటోకాల్ విషయం బండి ఆగ్రహం..!!
పాదయాత్ర పేరుతో వసూళ్ల రాజకీయానికి తెరలేపుతున్నారన్నారు. బాబు సర్కార్ బ్రహ్మండం అంటూ గతంలో రాతలు రాసిన ఎల్లో మీడియా…ఇచ్చిన హామిలను నెరవేర్చకపోతే ఎందుకు ప్రశ్నించలేదంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది చంద్రబాబు కాదా…రైతులకు బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టింది టీడీపీ ప్రభుత్వం కాదా..ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది ఎవరు…ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకే తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని.