TDP vs YSRCP : పోతుల సునీత నీ స్థాయి మరిచి మాట్లాడవద్దు – మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్ అయ్యారు.
- By Prasad Published Date - 03:50 PM, Tue - 6 September 22

వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి పోతుల సునీతకు లేదన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై పోతుల సునీత గారు చేసిన వ్యాఖలను ఆమె తీవ్రంగా ఖండించారు. వెంటనే పోతుల సునీత చేసిన వ్యాఖలను ఉపసంహరించుకోవాలని సౌమ్య డిమాండ్ చేశారు . పోతుల సునీత గతం మర్చిపోయి మతిభ్రమించి.. స్థాయి మర్చిపోయి మాట్లాడటం రాష్ట్ర ప్రజానీకం అంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. నీకు రాజకీయ బిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబాన్ని విమర్శ చేసే ముందు నీకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకొని స్పృహలో ఉండి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. మహిళలను రాజకీయంగా చైతన్యవంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. పోతుల సునీతాకు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనేనని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.