Chandrababu Naidu: కాన్వాయ్ ఆపి, రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసి!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమర్థవంతమైన రాజకీయ నాయకుడే కాదు.. ఆపదలో ఆదుకునే నాయకుడు కూడా.
- Author : Balu J
Date : 15-07-2023 - 1:13 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమర్థవంతమైన రాజకీయ నాయకుడే కాదు.. ఆపదలో ఆదుకునే నాయకుడు కూడా. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఎన్నోసార్లు సరైన సమయంలో స్పందించి ఎంతోమందికి సాయం చేశారు. నేడు ప్రతిపక్ష హోదాలో ఉన్నా అదే సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు ప్రజల పట్ల ఎంత బాధ్యతతో ఉంటారనడానికి ఈ ఘటన నిదర్శనం. ఏపీలోని విజయవాడ సీతానగరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు.
ఇది చూసి ఆ దారినే వెళ్తున్న చంద్రబాబు తన కాన్వాయ్‌ను ఆపించి కారు దిగి ఇద్దరు మహిళల వద్దకు వెళ్లారు. గాయపడిన మహిళలిద్దరికీ తన కాన్వాయ్‌లోని వైద్యుడితో చికిత్స చేయించి.. ఆ తర్వాత తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఇంటివద్ద దించి, వారికి కావాల్సిన మందులను ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఆపదలో ఉన్న ఎవరికైనా సాయపడేందుకు చంద్రబాబు ఎప్పుడూ ఇలా ముందుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
చంద్రబాబు గారు ప్రజల పట్ల ఎంత బాధ్యతతో ఉంటారనడానికి ఇది నిదర్శనం. విజయవాడ సీతానగరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఇది చూసి ఆ దారినే వెళ్తున్న చంద్రబాబుగారు తన కాన్వాయ్‌ను ఆపించి కారు దిగి ఇద్దరు మహిళల వద్దకు వెళ్లారు.
గాయపడిన… pic.twitter.com/SdkgoHQFdX
— Telugu Desam Party (@JaiTDP) July 15, 2023
Also Read: Razakar: తెలంగాణ పల్లెలపై జరిగిన దమనకాండ నేపథ్యంలో ‘రజాకర్’ మూవీ