HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Hard Comments On Cm Jagan

Chandrababu on Fire: సైకోల‌కే సైకో జ‌గ‌న్‌: ప‌ల్నాడు స‌భ‌లో చంద్ర‌బాబు

ఏపీ సీఎం సైకో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సైకోల‌ను త‌యారు చేస్తున్నాడ‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు.

  • Author : CS Rao Date : 19-10-2022 - 4:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Ys Jagan
Chandrababu Ys Jagan

ఏపీ సీఎం సైకో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సైకోల‌ను త‌యారు చేస్తున్నాడ‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. విప‌క్ష లీడ‌ర్ల‌పై దాడులు చేయిస్తూ తాడేప‌ల్లి ప్యాలెస్ లో సంతోషిస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని అధోగ‌తిపాలు చేశాడ‌ని ఆరోపించారు. రైతుల‌ను దారుణంగా మోసం చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉత్తుత్తి బ‌ట‌న్ నొక్కుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడ‌ని ఆగ్ర‌హించారు. రాష్ట్రాన్ని నెంబ‌ర్ 1గా చేయ‌డానికి మీరంద‌రూ క‌లిసి రావాల‌ని చంద్ర‌బాబు రైతుల‌కు పిలుపునిచ్చారు. ఆయ‌న ప‌ల్నాడు ప‌ర్య‌ట‌న ముగింపు స‌భ‌లో చేసిన ప్ర‌సంగం ప్ర‌ధానాంశాలు ఇలా ఉన్నాయి.

• అధిక వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
• ప్రత్తి పంటను పరిశీలించాను…పంట మొత్తం వర్షాలకు దెబ్బతింది
• భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు.
• పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.50 లక్షల ఎకరాల్లో మిరప పంటల సాగు ఉంది.
• మిరప, ప్రత్తి పంటలకు ఇప్పటికే ఎకరానికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు.
• తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టడం లేదా.
• అసత్యాలు చెప్పడంలో జగన్ దిట్ట….రైతులను ఆదుకోవాలనే ఆలోచన జగన్ కు లేదు.
• ప్యాలెస్ లో కూర్చుని కులకడానికి కాదు మీరు సిఎం అయ్యింది.
• రైతులకు ఇంత నష్టం జరిగితే అధికారులుగాని, ఎమ్మెల్యే గాని రాలేదు.
• పొలాలకు వెళ్లే ఎమ్మెల్యేలు రాలేదు….రైతులకు మేలు చేసే సిఎం రావాలి.
• జగన్ ఉత్తుత్తి బటన్ తో ఎవరికీ లాభం లేదు….జగన్ పొట్ట అబద్దాల పుట్ట.
• జగన్ కు ధైర్యం ఉంటే రైతులకు ఏమి ఇచ్చావో ప్రతి గ్రామంలో బోర్డు పెట్టాలి
• రైతులకు కట్టాల్సిన పంటల భీమా డబ్బులు కూడా కట్టని ప్రభుత్వం ఇది.
• మన మీద కేసులు పెడితే ఏమవుతుంది.
• పవన్ కళ్యాన్ పార్టీ వారి పైనా కేసులు పెట్టారు. అందుకే నేను వెళ్లి సంఘీభావం తెలియజేశాను.
• మాపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ద రైతులను ఆదుకోవడంపై పెట్టాలి
• గత ఏడాది మిర్చికి తామర పురుగువచ్చి పంట పోతే ఒక్కరైనా వచ్చి చూశారా…
• జగన్ రెడ్డి పాలన వల్ల రైతులు అంతా నాశనం అయ్యారు.
• జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. జగన్ సిఎం అయిన తరువాత గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు పెరిగాయి
• జగన్ పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
• దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది….కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది.
• దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతులు మన రాష్ట్ర రైతులే.
• రైతులపై తలసరి అప్పు 2.45 లక్షల గా ఉంది.
• ఈ ప్రభుత్వంలో మైక్రో ఇరిగేషన్ రావడం లేదు…ఎరువులు సకాలంలో రావడం లేదు.
• 2024లో గాని, జగన్ భయపడి ముందు ఎన్నికలు జరిపినా గానీ వైసిపిని ప్రజలను భూస్థాపితం చేస్తారు.
• మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నాడు. తెలంగాణ మీటర్లు పెట్టడం లేదు.
• ఎక్కడా లేని ఈ అతితెలివి నీకే ఎందుకు వచ్చింది జగన్…
• ఈ అతి తెలివి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి.
• భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరా పత్తికి 30 వేలు, ప్రతి ఎకరా మిరపకు 50 వేల పరిహారం ఇవ్వాలి.
• మైక్రో ఇరిగేషన్ ద్వారా 90శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత టిడిపి దే.
• టిడిపి హయాంలో 60 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు పెడితే….ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు.
• జగన్ ఎక్కడ నుంచి వచ్చాడు….రైతు కుటుంబం నుంచి రాలేదా
• అమరావతి రైతులను హేళన చేస్తారా….కార్లు, బంగారం అని హేళన చేస్తారా
• నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఒక్కరికి ఉద్యోగం రాలేదు.
• నా జీవితంలో దాపరికం లేదు…అందుకే అన్ స్టాపబుల్ లో అన్ని వివరించాను.
• రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేవరకు విశ్రమించను
• పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా
• మీ దోపిడీ, కబ్జాలు బయటపడతాయి అని పవన్ ను అడ్డుకున్నారా
• వినుకొండలో రైతును చెప్పుతో కొట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టిన ప్రభుత్వం ఇది
• జగన్ మోహన్ రెడ్డి సైకో అనుకుంటే…ఆయన కొత్త సైకోలను తయారు చేస్తున్నారు.
• అమరావతి కి వెళ్లేటప్పుడు నా కాన్వాయ్ పై దాడి చేస్తే ప్రజాస్వామ్యం అన్నారు.
• నా ఇంటిపై ఎమ్మెల్యే దాడికి వస్తే వాళ్లు అపాయింట్మెంట్ కోసం వచ్చారు అని చెపుతున్నారు.
• టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది అయ్యింది….ఇప్పటికీ చర్యలు లేవు..డిజిపి సమాధానం చెప్పగలరా
• తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు, దాడులకు నేను భయపడను
• వివేకా హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అన్నారు.
• నాది హత్యలు చేసిన చరిత్ర కాదు…ఆ తరహా రాజకీయం తెలీదు
• తప్పులు చేసిన వారిని బోను ఎక్కించిన చరిత్ర నాది
• నాడు వివేకా హత్యపై జగన్ సిబిఐ దర్యాప్తు కావాలి అన్నారు…తరువాత సిఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు వద్దు అన్నారు.
• కన్న కూతురుగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతను అభినందించాలి
• సిబిఐ దర్యాప్తు చేస్తుంటే వారిపైనే కేసులు పెట్టారు.
• ఇది ఎక్కడైనా ఉంటుందా…ఎవరైనా అడ్డంగా ఇలా చెయ్యగలరా
• ఇప్పుడు సుప్రీం కోర్టులో మళ్లీ వివేకా హత్యపై విచారణ జరుగుతుంది
• సునీత వాదన అంత నిజం అని సిబిఐ కూడా అఫిడవిట్ వేసింది.
• ఈ ముఖ్యమంత్రికి ఒక్క నిముషం అయినా ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా.
• పవన్ రాజకీయ పార్టీ వేరే కావచ్చు…..కానీ ప్రజాస్వామ్యం కోసం నేను వెళ్లి మద్దతు ఇచ్చాను.
• రాజకీయ పార్టీలకే దిక్కులేకపోతే……ఇక ప్రజల సంగతి ఏంటి.
• అందుకే ఈ రోజు ప్రశ్నిస్తున్నా….తప్పుడు ఆరోపణలకు సిఎం సమాధానం చెప్పాలి
• జగన్ పాలనలో బిసిలు, ఎస్సిలు, ముస్లింలు సహా అందరూ దెబ్బతిన్నారు.
• జగన్ పాలనలో ప్రజల అప్పులు పెరిగాయి..ఆదాయం పెరగలేదు
• అప్పులు పెంచే ప్రభుత్వం మనకు అవసరమా
• ఈ ముఖ్యమంత్రి ప్రతాపం అన్నా క్యాంటీన్ లపైనా
• రాష్ట్రాన్ని కాపాడుకుందాం…అందరూ సహకరించాలని కోరుతున్నా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • ap politics
  • Chandra Babu Naidu
  • palnadu

Related News

Mavigun

జ‌గ‌న్ ‘మావిగన్’.. ఈ ఐడియా ఇచ్చింది ఎవ‌రంటే?!

జగన్ ఇతరుల నుండి సలహాలు, ఆలోచనలు తీసుకుంటే ఇప్పుడున్న స్థాయి నాయకుడు అయ్యేవారు కాదు. జ‌గ‌న్‌ ఎప్పుడూ తన స్వశక్తితో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతారు.

  • TDP MLA Chadalavada Aravinda Babu

    Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబు తీరుపై చంద్రబాబు సీరియస్

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Vijayasai Reddy about amaravati

    Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd