HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Clarity On Alliance With Janasena And Bjp

TDP Janasena Alliance : వార్ వ‌న్ సైడ్‌..పొత్తు తూచ్‌!

ఏపీలో ఎన్నిక‌లకు ఇంకా రెండేళ్ల టైం ఉన్న‌ప్ప‌టికీ పొత్తుల పేరుతో పార్టీల‌ను లైవ్ లో ఉంచుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

  • Author : CS Rao Date : 06-06-2022 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

ఏపీలో ఎన్నిక‌లకు ఇంకా రెండేళ్ల టైం ఉన్న‌ప్ప‌టికీ పొత్తుల పేరుతో పార్టీల‌ను లైవ్ లో ఉంచుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. `ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు` అనే ఒకే ఒక అంశాన్ని తీసుకుని ప్ర‌ధాన పార్టీల‌తో జ‌న‌సేన వేసిన ట్రాప్ లో టీడీపీ వైసీపీ ప‌డిపోయాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు జ‌న‌సేన‌కు క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. రెండు ప్ర‌ధాన పార్టీలు గుర్తింపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద గుర్తుంపు కూడా లేని జ‌న‌సేన గురించి ప‌దేప‌దే మాట్లాడే స్థాయికి ప‌డిపోయాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్ విసిరిన రాజ‌కీయ వ‌ల‌లో చిక్కుకుని గిల‌గిల కొట్టుకుంటున్నాయి. రాష్ట్రాభివృద్ధి, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కంటే జ‌న‌సేన‌తో పొత్తు గురించే మాట్లాడుకోవ‌డం విడ్డూరం.

ప్ర‌జా వ్య‌తిరేక ఓటు చీలిపోవ‌డం కార‌ణంగా 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రాలేద‌ని ఆ పార్టీ భావ‌న‌. ఇదే సూత్రాన్ని 2019 ఎన్నిక‌ల‌కు వ‌ర్తింప చేస్తే చంద్ర‌బాబు తిరిగి అధికారంలోకి రావాలి. స‌రిగ్గా ఇక్క‌డే లాజిక్ ను టీడీపీ మేధావులు గ‌మ‌నించాలి. ఉమ్మ‌డి ఏపీ ఉన్న‌ప్ప‌టి నుంచి విడిపోయిన ఏపీకి జ‌రిగిన 2014, 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు తీసుకుంటే, ఎప్పుడూ వార్ ఒన్ సైడ్ మాత్ర‌మే ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ టీడీపీని 1982లో పెట్టిన‌ప్ప‌టి నుంచి తీసుకుంటే 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఇలా ఏ ఎన్నిక తీసుకున్న‌ప్ప‌టికీ రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాత్ర‌మే అధికార బ‌ద‌లాయింపు ఉంది. పొత్తులు కేవ‌లం నామ‌మాత్ర‌పు ప్ర‌భావాన్ని మాత్ర‌మే చూపాయ‌ని ఆ ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల‌కు వ‌చ్చిన ఓట్లు, సీట్ల‌ను గ‌మ‌నిస్తే అర్థం అవుతోంది. తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కార‌ణంగా చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ అంటూ కొంద‌రు లెక్కిస్తున్నారు. కానీ, ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న కార‌ణంగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఓట‌ర్లు మ‌ళ్లార‌నే విష‌యాన్ని విస్మ‌రిస్తున్నారు. విభ‌జ‌న వాదాన్ని వినిపించిన టీడీపీ అనుకూల ఓట‌ర్లు కూడా ప్ర‌జారాజ్యం పార్టీకి వెళ్లార‌ని సునిశితంగా ప‌రిశీంచిన వాళ్లు ఎవ‌రైనా చెబుతారు. అందుకే, ఆ పార్టీకి ఏపీలో 2009 ఎన్నిక‌ల్లో త‌క్కువ సీట్లు, తెలంగాణ‌లో ఎక్కువ సీట్లు రావ‌డం జ‌రిగింది.

1999, 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ స‌క్సెస్ అయింది. ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ దేశ స్థాయి రాజ‌కీయాల ప్ర‌భావం ప‌డింది. వాజ్ పేయ్ క్రేజ్ 1999లోనూ 2014లో మోడీ హ‌వా దేశ వ్యాప్తంగా ప‌నిచేశాయి. ఫ‌లితంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఊహించిన వాటి కంటే ఎక్కువ‌గా ఎమ్మెల్యేల‌ను గెలుచుకోగ‌లిగింది. ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ ఆనాడు బ‌ల‌మైన క‌మ్యూనిస్ట్ పార్టీల‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు కోసం పొత్తు పెట్టుకుని ఎప్పుడూ స‌క్సెస్ అయిన ఆన‌వాళ్లు పెద్ద‌గా లేవు. కేవ‌లం ఆయా ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెర‌పైకి వ‌చ్చిన అంశాల వారీగా మాత్ర‌మే అధికారం చేజిక్కించుకున్న దాఖ‌లాలు ఉన్నాయి. 2009 ఎన్నిక‌ల బూచిన చూపిస్తూ జ‌న‌సేన లేకుండా టీడీపీ 2024 ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేద‌నే అంచ‌నా బ‌హుశా రాజ‌కీయ మైండ్ గేమ్ లో భాగంగా చూడాల్సి ఉంటుంది. పైగా ఒక ప్రాంతీయ పార్టీ మరొక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏమ‌వుతుందో 2009 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్, టీడీపీ పొత్తు ఒక పాఠాన్ని నేర్పింది. ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తో పొత్తు కార‌ణంగా టీడీపీ క్యాడ‌ర్ జారిపోయింది. ఫ‌లితంగా తెలంగాణలో టీడీపీ ప్ర‌శ్నార్థ‌కంగా మిగిలింది.

2009 పొత్తు సూత్రాన్ని అన్వ‌యించుకుంటే, ఒక వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే జ‌రిగే న‌ష్టం టీడీపీకే ఎక్కువ‌. డెడ్ స్టేజ్ లోనూ 40శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ ఎంత ఓటు బ్యాంకు ఉందో కూడా తెలియ‌ని జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే వ‌చ్చే లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌ని టీడీపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. నిజంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ఉంటే ప్ర‌త్యామ్నాయ పార్టీ వైపు ఓట‌ర్లు చూస్తారు. వార్ ఒన్ సైడ్ ఉంటుంది. ఏపీ ఎన్నిక‌ల చ‌రిత్ర‌ను తిర‌గ‌తోడితే అదే చెబుతోంది. ఒక వేళ ప‌వ‌న్ మ‌ద్ధ‌తుతో 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలించింద‌ని భావిస్తే, అదే ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో చీల్చిన ఓటు బ్యాంకుతో తిరిగి చంద్ర‌బాబు సీఎం కావాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు క‌నుక ప‌వ‌న్ తో పొత్తు న‌ష్ట‌మా? లాభ‌మా? అనే కోణం నుంచి సీరియ‌స్ గా ఆలోచిస్తోన్న టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావిస్తోందట‌.

నెల‌కో, రెండు నెల‌ల‌కోసారి మీడియా ముందు పొత్తు గురించి మాట్లాడే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఫ‌లితంగా జ‌న‌సేన‌కు మీడియా క్రేజ్ తీసుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా మూడు నెల‌ల క్రితం ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోనివ్వ‌న‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అందుకోసం బీజేపీ రోడ్ మ్యాప్ గురించి చూస్తున్నానంటూ వెల్లిడించారు. దీంతో ఆ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందోన‌ని ప్ర‌ధాన పార్టీలు చూశాయి. సీన్ కట్ చేస్తే, మూడు ఆప్ష‌న్లను ఇస్తూ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌వ‌న్ ఎంచుకున్నారు. వాటిలో ఒక‌టి జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు. రెండోది జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ క‌లిసి 2024 ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం. ఇక మూడోది జ‌న‌సేన ఒంటరిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం.

ఒక‌టో ఆప్ష‌న్ ఎంచుకుంటే వ‌చ్చే ఫ‌లితాలు ఎలా ఉంటాయో తిరుప‌తి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌ను చూసి అంచ‌నా వేసుకోవ‌చ్చు. రెండో ఆప్ష‌న్ కు బ‌హుశా చంద్ర‌బాబు అంగీక‌రించక పోవ‌చ్చు. మూడో ఆప్ష‌న్ ను ప‌వ‌న్ ఎంచుకుంటే 2019లో కూట‌మికి వ‌చ్చిన ఓట్లు కూడా జ‌న‌సేన‌కు వ‌స్తాయా? రావా? అనే లెక్క‌లు ముందుగా వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే పొత్తుల ప్ర‌స్తావ‌న అంటూ బాబు దాట‌వేస్తున్నారు. జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే మాత్రం టీడీపీకి తెలంగాణ‌లో జ‌రిగిన న‌ష్టం ఏపీలో పొంచి ఉంటుంద‌న్న విష‌యాన్ని సీరియ‌స్ గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సీనియ‌ర్లు బాబుకు సూచిస్తున్నార‌ట‌. ఇలాంటి పరిస్థితుల్లో చంద్ర‌బాబు ఎలాంటి స్కెచ్ వేస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap bjp
  • ap politics
  • janasena tdp alliance
  • TDP chandrababu naidu
  • telugu desam party
  • ysrcp

Related News

Former Andhra Pradesh CM Nadendla Bhaskara Rao Passes Away

Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయన అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటల

  • HBDOneAndOnlyCBN

    HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • Jr Ntr Birthday Wishes To C

    Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Latest News

  • Elections : తొలి విడతలో 110 సీట్లు గెలుస్తాం – అమిత్ షా ధీమా

  • RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR

  • Hero Sunil : సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన హీరో రాజశేఖర్

  • Bangladesh : బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఇండియాను దాటేస్తుంది – IMF

  • RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd