HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp And Cpm Parties Staged Large Scale Protests Against The Hike In Electricity Tariffs In Ap

AP Electricity Charges Hike: జ‌గ‌న‌న్న‌ విద్యుత్ బాదుడు పై.. ప్ర‌తిప‌క్షాల రియాక్ష‌న్ ఇదే..!

  • Author : HashtagU Desk Date : 31-03-2022 - 4:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Electricity Charges Hike Ys Jagan
Ap Electricity Charges Hike Ys Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ వినియోగ‌దారుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల‌ను భారీగా పెంచుతూ, బుధ‌వారం విద్యుత్ నియంత్ర‌ణా మండ‌లి (ఈఆర్ఎస్) కొత్త ఛార్జీల‌ను ప్ర‌క‌టించింది. దీంతో పెరిగిన ఛార్జీల‌తో సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై పెద్ద ఎత్తున భారం ప‌డ‌బోతుంది. ఒక‌వైపు క‌రోనా పేరు చెప్పి, మ‌రోవైపు ఉక్రెయిన్- ర‌ష్యా యుధ్ధం పేరు చెప్పి, ఇప్ప‌టికే నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌తో పాటు, డొమెస్టిక్ గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర‌, పెట్రోల్ అండ్ డీజిల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిపోయాయి. అయితే క‌రెంట్ ఛార్జీలు కూడా పెంచ‌డంతో.. పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై పెనుభారం ప‌డ‌నుంది.

ఇక ఏపీలో విద్యుత్​ ఛార్జీల పెంపుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ నేత‌లు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. పేదలు విద్యుత్ ఛార్జీలు కట్టేందుకు దానం ఇవ్వాలంటూ భిక్షాటన చేపట్టిన టీడీపీ నేత‌లు, సిటీ బస్సులు ఆపి ప్రయాణికుల్ని బిచ్చమడిగారు. భిక్షాటన చేస్తే కానీ కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని, జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రాష్ట్ర ప్రజలు మళ్లీ లాంతర్లతో బతికే రోజులొచ్చాయంటూ టీడీపీ నేత‌లు లాంతర్ల ప్రదర్శన చేపట్టారు.

ఇక ఫ్యాన్ పార్టీకి ఓటేసిన వాళ్ళు, ఇళ్ళ‌ల్లో ఫ్యాన్ వేసుకోకూడదన్నట్లు ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, జగన్​రెడ్డి బాదుడే బాదుడు అంటూ టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు. ఇక మ‌రోవైపు రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన సీపీఐ నేత‌లు, పన్నులు, ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్‌ వరుస భారాలు మోపుతున్నారని సీపీఐ నేత‌లు మండిప‌డ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రో, గ్యాస్, నిత్యావసర ధరలను పెంచిందని, అది చాలదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం దుర్మార్గమైన చర్య అని, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సీపీఐ నేత‌లు ధ్వజమెత్తారు. మ‌రి విద్యుత్ ఛార్జీల పెంపును జ‌గ‌న్ సర్కార్ ఏవిధంగా స‌మ‌ర్ధించుకుంటుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Electricity Charges Hike
  • cpm
  • tdp
  • ysrcp

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, కాబట్టి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు

    Latest News

    • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

    • Nandigam Suresh : నందిగం సురేష్‌పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?

    • Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

    • సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

    • కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd