Nara Bhuvaneswari : నారా భువనేశ్వరికి టీసీఎల్ సంస్థ ప్రతినిధుల సంఘీభావం
నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి నియోజకవర్గం, వికృతమాల గ్రామం లో TCL సంస్థ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.
- By Prasad Published Date - 12:42 PM, Fri - 27 October 23
నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి నియోజకవర్గం, వికృతమాల గ్రామం లో TCL సంస్థ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిచెందుకు వెళ్తున్న సమయంలో టీసీఎల్ సంస్థ ప్రతినిధులు భువనేశ్వరిని కలిశారు. సంస్థకు చెందిన జాసన్, అమరేంద్ర, సురేష్ రెడ్డి తమ పరిశ్రమ మీదుగా వెళ్తున్న భువనేశ్వరిని కలిసి మద్దతు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టీసీఎల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు అయిందని భువనేశ్వరి కి తెలిపారు. ఈ సందర్భం గా సంస్థకు సంబందించిన ఉత్పత్తులు, ఉద్యోగుల సంఖ్యపై భువనేశ్వరి సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు అయిందని, టీసీఎల్ పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడం ద్వారా 1500 మందికి ఉద్యోగాలు లభించాయని ప్రతినిధులు భువనేశ్వరికి వివరించారు. పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ముందు భువనేశ్వరి తో ఉద్యోగులు, ఆ సంస్థ ప్రతినిధులు ఫోటో దిగారు. వేల మందికి ఉపాధి కల్పించే పెద్ద సంస్థ ఈ ప్రాంతం లో ఏర్పాటు కావడం పై భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: TDP : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.? – నారా భువనేశ్వరి
Related News
TDP : చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు నేతలపై వేటు
TDP : ఎన్నికల వేళ ఏ రాష్ట్రంలోనైనా అన్ని పార్టీలకు రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా ఉంటుంది.