Tahsildar Died: సస్పెన్షన్ లో తహసీల్దార్.. తీవ్ర జాప్యంతో గుండెపోటు
ఉద్యోగ బాధ్యతల్లో జాప్యం పట్ల కలత చెందినట్లు సమాచారం.
- By Balu J Published Date - 12:37 PM, Thu - 31 August 23

Tahsildar Died: అక్రమాస్తుల ఆరోపణలపై సస్పెన్షన్‌లో ఉన్న తహశీల్దార్ బుధవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గుండెపోటుతో మృతి చెందారు. భాస్కర్ నారాయణ పుట్టపర్తిలో తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తుండగా.. కొన్ని నెలల క్రితం అక్రమాస్తుల ఆరోపణలపై అధికారులు సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయనను తిరిగి ఆ పదవిలో నియమించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, భాస్కర్ నారాయణ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఉద్యోగ బాధ్యతల్లో జాప్యం పట్ల కలత చెందినట్లు సమాచారం. బుధవారం ఆయన తన నివాసంలో గుండెపోటుకు గురై మరణించారు. సస్పెన్షన్‌తో పాటు తిరిగి విధుల్లో చేరడంలో జాప్యం కారణంగా ఆయన ఒత్తిడికి లోనయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. జాప్యమే ఆయన మృతికి కారణమని ఆరోపించారు.
Also Read: Khammam Politics: బీఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై.. కాంగ్రెస్ చేరికకు రంగం సిద్ధం!