Chandrababu Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.. శుక్రవారం ఫైనల్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఉన్నారు.కేసును కొట్టేయాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఈ రోజు మంగళవారం సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి.
- Author : Praveen Aluthuru
Date : 17-10-2023 - 6:21 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు.కేసును కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఈ రోజు మంగళవారం సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీకోర్టు ధర్మాసనం..తిరిగి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
క్వాష్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున న్యాయవాది హరీష్‌సాల్వే వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని, ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదని తీర్పు వచ్చేవరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హరీశ్ సాల్వే ధర్మాసనాన్నికోరారు. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని విన్నవించారు. దానికి సమాధానంగా లిఖితపూర్వక వాదనలు ఏవైనా ఉంటే శుక్రవారం లోపు సమర్పించాలని, మొత్తం పరిశిలించి ఒకేసారి తుది తీర్పు ఇస్తామంటూ ధర్మాసనం విచారణ ముగించింది.
శుక్రవారం రోజు చంద్రబాబు తరఫు న్యాయవాదులు, సీఐడీ తరపున న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించవలసి ఉంది. అయితే శుక్రవారం నాడు కచ్చితంగా బెయిల్ విషయంలో శుభవార్తే ఉంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CM KCR: కేటీఆర్ ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల ప్రజల అదృష్టం: సీఎం కేసీఆర్