CM Jagan : సుప్రీం కోర్ట్ లో జగన్ కు ఎదురుదెబ్బ ..
ఏపీలో సీఎంగా ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు నానాటికీ ఆలస్యమవుతోందని, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా జగన్ తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని
- By Sudheer Published Date - 12:56 PM, Fri - 3 November 23

వైసీపీ అధినేత , సీఎం జగన్ కు సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ ఎదురైంది. అక్రమాస్తుల కేసులో సుప్రీం
కోర్ట్ జగన్ కు నోటీసులు జారీ చేసింది. జగన్‌తో పాటు సీబీఐకి (CBI) కూడా సుప్రీం నోటీసులు ఇచ్చింది. జగన్ కేసులకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjeev Khanna), జస్టిస్ ఎస్వీఎన్ భట్టి (Justice SVN Bhatti) ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇందులో భాగంగా జగన్ అక్రమాస్తుల కేసులో విపరీతమైన జాప్యం ఎందుకు జరగుతుందని సుప్రీం కోర్ట్ ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు తెలుపాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ సుప్రీం నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అసాధారణ జాప్యాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఈ నోటీసులు పంపింది.
ఏపీలో సీఎంగా ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు నానాటికీ ఆలస్యమవుతోందని, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా జగన్ తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. అలాగే ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇప్పటికే 3 వేల సార్లు వాయిదా వేసిందని కూడా పేర్కొన్నారు.
Read Also : KCR : కామారెడ్డిలో పౌల్ట్రీ రైతుల నుండి కేసీఆర్ కు పెద్ద చిక్కొచ్చి పడింది