HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Support Australian Investments In Ap Minister Lokesh

Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు.

  • Author : Gopichand Date : 19-10-2025 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Lokesh
Minister Lokesh

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆయన సిడ్నీలో ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియాకు కీలకమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మలచాలని మంత్రి ఈ భేటీలో విజ్ఞప్తి చేశారు.

‘స్టేట్ ఎంగేజ్‌మెంట్ ఎజెండా’లో ఏపీని చేర్చండి

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “కీలకమైన పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్‌మెంట్ ఎజెండాలో చేర్చాలని” కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు బలమైన వేదికను ఏర్పాటు చేస్తుందని ఆయన వివరించారు.

ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్‌కు మద్దతు

ఏపీఈడీబీ (APEDB), సీఐఐ (CII), బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించనున్న ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాజెక్టులలో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈవోలకు రాష్ట్ర ప్రత్యేకతలను తెలియజేయాలని కోరారు.

Also Read: TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

పెట్టుబడుల కారిడార్లలో భాగస్వామ్యం

“ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని” మంత్రి లోకేష్ మెక్ కేని కోరారు. అలాగే ఫోరం వాణిజ్య, పెట్టుబడుల ఎజెండాలో “ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్- గేట్ వే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా” అనే అంశంపై ఉమ్మడి నివేదికలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

‘పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025’కు ఆహ్వానం

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెక్ కే మాట్లాడుతూ… ఆస్టేలియా- భారత్ నడుమ ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి 2012లో ఇరుదేశాల ప్రధానమంత్రుల నేతృత్వంలో ఫోరంను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య $48.4 బిలియన్ల వాణిజ్య భాగస్వామ్యానికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. విధానపరమైన సహకారాన్ని సులభతరం చేసేందుకు సీఐఐతో కలిసి పనిచేస్తున్నట్లు మెక్ కే వెల్లడించారు. ఈ సమావేశం ఏపీకి ఆస్ట్రేలియా పెట్టుబడుల ద్వారాలను మరింత విస్తృతం చేస్తుందని భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • australia
  • Investments
  • Minister Lokesh
  • Sydney
  • telugu news

Related News

Heritage Promise

హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య కథనాలను ప్రసారం చేసినందుకు గానూ సాక్షి మీడియాపై హెరిటేజ్ ఫుడ్స్ రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.

  • BR Naidu

    తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

  • New Jersey

    చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

  • Australia

    ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

Latest News

  • విడాకులు తీసుకున్న మ‌రో టీమిండియా క్రికెట‌ర్!

  • ఈ దేశాల్లో బంగారు నాణేలు చలామణి!

  • Mumbai Airport : నూతన అధ్యాయానికి నాంది పలికిన ముంబై ఎయిర్పోర్ట్

  • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

  • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

Trending News

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd