Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ ఫై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు..ఇదొక గుణపాఠం
చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చాలా అభివృద్ధి చేశారని.. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా అభివృద్ధి చేశాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వడం చాల బాధాకరమని
- By Sudheer Published Date - 03:32 PM, Mon - 25 September 23

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై నటుడు సుమన్ (Actor Suman) స్పందించారు. రాజకీయాల్లో ఇదొక గుణపాఠం అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చాలా అభివృద్ధి చేశారని.. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా అభివృద్ధి చేశాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వడం చాల బాధాకరమని , బాబు పొలిటికల్ ప్రిసనర్ కాదని తెలిపారు. బాబు తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నాని అన్నారు.
చంద్రబాబు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడూ వస్తాడో తెలుస్తుంది. టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఆయనకు అన్నీ అనుకూలంగా వచ్చే వరకు జైలులొనే ఉంటారు. ‘‘మా స్టాఫ్ తప్పు చేసిన అది మా పైకే వస్తుంది అలాగే ఆయనకి తెలుసో తెలియకుండానే అది తప్పు జరిగి ఉండొచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అన్ని ఆలోచించాకే అరెస్ట్ చేసి ఉంటారు. జగన్ (CM JAGAN) వల్లే చంద్రబాబు జైలుకు వెళ్ళాడంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉండి ఉంటాయి. సమయం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’ అని సుమన్ చెప్పుకొచ్చాడు.
Read Also : MLC Nominations Rejected : సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ