HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Staff Misappropriation At The Durga Temple

Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

  • Author : Vamsi Chowdary Korata Date : 31-03-2026 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada Durga Temple
Vijayawada Durga Temple

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దొరికిపోయారు. హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. వీరు హుండీల్లోని అసలైన బంగారాన్ని రోల్డ్‌ గోల్డ్‌గా మార్చేందుకు ప్లాన్ చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. అప్పుడు వీరి ఘనకార్యం బయటపడింది. బాధ్యులైనవారికి ఆలయ ఈవో మెమోలు జారీ చేశారు.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా బయటపడింది. హుండీల కానుకల లెక్కింపులో సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. భక్తులు సమర్పించిన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ పేరుతో దారి మళ్లించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల్ని లెక్కిస్తుంటారు. అయితే ఆలయ సిబ్బంది హుండీ కానుకల్లో సమర్పించిన అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెట్టి అక్రమంగా తీసుకెళ్లాలని పథకం వేశారు. రోల్డ్‌గోల్డ్ పేరుతో బంగారం పక్కన పెట్టడంపై ఆలయ పాలకమండలి సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ బంగారాన్ని తనిఖీ చేయడంతో వీరి గుట్టు బయటపడింది.

పాలకమండలి సభ్యుల తనిఖీల్లో దాదాపు రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది ఘనకార్యంపై ఈవో శీనా నాయక్ సీరియస్‌గా స్పందించారు. బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసిన సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వారిపై తదుపరి చర్యలు ఉంటాయన్నారు. దీనిపై ఈవో సమగ్ర విచారణకు ఆదేశించారు. వాస్తవానికి దుర్గమ్మ ఆలయంలో హుండీలు లెక్కించే సమయంలో సీసీ కెమెరాలతో పాటుగా త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినా సరే సిబ్బంది బంగారాన్ని మాయం చేసే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు హుండీలలో కానుకల్ని సమర్పిస్తుంటారు. డబ్బులతో పాటుగా బంగారం, వెండి వంటి వస్తువుల్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ హుండీలను ఆలయంలోనే లెక్కిస్తుంటారు. సీసీ కెమెరాలతో పాటుగా అధికారుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినా సరే ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈవో శీనా నాయక్ సీరియస్‌గా ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఆరా తీస్తున్నారు. అధికారులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కలకలం రేపిన ఈ రోల్డ్‌గోల్డ్ ఎపిసోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • gold theft
  • Kanaka Durga Temple
  • Rold Gold
  • temple staff
  • vijayawada durga temple
  • Vijayawada Kanaka Durga Temple

Related News

Goods Train Derailment

Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్..

Andhra Pradesh విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ట్యాంకర్ గూడ్స్ రైలు కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రెండు ట్యాంకర్ వ్యాగన్లు బోల్తా పడటంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన ట్యాంకర్ వ్యా

  • Lpg Gas Cylinder

    Gas cylinder: గ్యాస్ సిలిండర్ తేలేదని.. ఫినాయిల్ తాగిన భార్య..

  • Cbn Jagan

    AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Rajahmundry Kakinada Trains

    Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

Latest News

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

  • Spam Calls : స్పామ్ కాల్సు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మళ్లీ అలాంటి కాల్స్ ఉండవు !!

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd