HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sports Mega Dsc 2025 Filling Of 421 Sports Quota Posts Transparently And Technology Based

AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ

  • Author : Vamsi Chowdary Korata Date : 02-06-2026 - 1:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sports Mega Dsc
Sports Mega DSC: 421 Posts to be Filled from 3,600 Athletes

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా, నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసింది.

పాఠశాల విద్యాశాఖ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు, క్రీడాకారుల కోసం అమల్లో ఉన్న 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కింద మొత్తం 421 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నియామక ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. మొత్తం 3,600 మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకోగా, 5,326 పోస్టు ప్రాధాన్యతలు నమోదయ్యాయి. కేవలం 421 పోస్టుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొనడం క్రీడాకారుల్లో ప్రభుత్వ ఉద్యోగాలపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.

నియామక ప్రక్రియ మొత్తం పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడింది. అభ్యర్థులు తమ క్రీడా, విద్యా వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా వ్యవస్థను రూపొందించడం ద్వారా మానవ జోక్యాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచారు.

క్రీడా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం 6 మంది సభ్యులతో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో భౌతిక ధ్రువీకరణ నిర్వహించి, జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర క్రీడా సంఘాలు, విశ్వవిద్యాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాల ప్రామాణికతను నిర్ధారించారు. విద్యార్హతల పరిశీలన కోసం 15 మంది అధికారులను పాఠశాల విద్యాశాఖ నియమించింది.

అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగేలా తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను విడుదల చేసి అభ్య

ర్థులు, ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 192 ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించారు. అనంతరం తుది ప్రాధాన్యత జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించింది.

నియామక ప్రక్రియపై దాఖలైన 69 న్యాయపరమైన కేసులను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటూ, హైకోర్టు ఆదేశాలను పూర్తిగా పాటించింది. అవసరమైన చోట్ల పునఃపరిశీలన చేపట్టి, ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది.

ముఖ్యాంశాలు

* క్రీడాకారుల కోటాలో భర్తీ చేసిన పోస్టులు – 421

* దరఖాస్తు చేసిన అభ్యర్థులు – 3,600 మంది

* నమోదైన పోస్టు ప్రాధాన్యతలు – 5,326

* క్రీడా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కమిటీ – 6 మంది సభ్యులు

* విద్యార్హతల పరిశీలనకు నియమించిన అధికారులు – 15 మంది

* పరిష్కరించిన ఫిర్యాదులు – 192

* న్యాయస్థానాల్లో దాఖలైన కేసులు – 69

* నోటిఫికేషన్ నుంచి తుది జాబితా ఆమోదం వరకు ప్రక్రియ పూర్తి – 112 రోజులు

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా క్రీడా రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రతిభ, పారదర్శకత, న్యాయబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Andhrapradesh Govt
  • AP Sports
  • jobs
  • Minister Nara lokesh
  • Sports Mega DSC

Related News

Air Trunk Campus to be Established in Visakhapatnam! — Minister Nara Lokesh

Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో ‘ఎయిర్‌ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్’ను ఏర్ప

  • Drinking Water Problem in Mangalagiri Resolved Through Minister Nara Lokesh's Initiative

    Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

  • Talliki Vandanam Guidelines

    Talliki Vandanam : తల్లికి వందనంపై కీలక అప్డేట్

  • TDP MLA MADHAVI REDDY

    TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Latest News

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

  • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

  • Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd