HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Key Update On Thalliki Vandanam

Talliki Vandanam : తల్లికి వందనంపై కీలక అప్డేట్

  • Author : Vamsi Chowdary Korata Date : 01-06-2026 - 9:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Talliki Vandanam Guidelines
Talliki Vandanam Guidelines

ఏపీలో ప్రభుత్వం స్కూల్, ఇంటర్ విద్యార్థుల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద డబ్బులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగానే అర్హుల జాబితాలను సిద్ధం చేసింది. విద్యార్థులు అర్హుల జాబితాను చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేక వెబ్‌పోర్టల్ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులా కాదా, అసలు పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఏటా స్కూల్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున ఇస్తున్నారు. ఇందులో రూ. 13 వేలు విద్యార్థుల తల్లుల అకౌంట్‌లలో జమ చేస్తుండగా, మరో రూ. 2 వేలు మాత్రం స్కూల్ నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఈ డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులో కాదో, పథకం వర్తిస్తుందో లేదోనని అందరిలో సందేహం ఉంది. ఒకవేళ అర్హులమైతే ఆ సమాచారం ఎలా తెలుసుకోవాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులో కాదో తెలుసుకోవడానికి ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు, వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వెబ్‌ పోర్టల్ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులో కాదో వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘స్కీమ్ ఎలిజిబిలిటీ’ ఆప్షన్ క్లిక్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లబ్ధిదారుల ఆధార్ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పథకం, ఏ సంవత్సరమో సెలెక్ట్ చేసిన తర్వాత ‘గెట్ డిటైల్స్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబరుతో పాటు కింద ఉండే క్యాప్చా ఎంటర్ చేస్తే లబ్ధిదారుల సమాచారం వస్తుంది. ఆ వివరాలను సరిచూసుకుని.. ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలని నర్సీపట్నం సూచిస్తోంది. ఏపీ ప్రభుత్వం సాంకేతిక సమస్యలతో పాటుగా మ్యాపింగ్‌ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల మ్యాపింగ్‌ పూర్తయితేనే తల్లికి వందనం డబ్బులు అందుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు దగ్గరలోని సచివాలయానికి వెళ్తే అక్కడి సిబ్బంది పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Andhrapradesh Govt
  • naralokesh
  • Talliki Vandanam
  • Talliki Vandanam Scheme

Related News

'Made in Jonnagiri' gold enters the market.

Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

మేడిన్ ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్‌మైన్స్‌ నుంచి గోల్డ్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్‌ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌తో పాటుగా జొన్నగిరి గోల్డ్‌మైన్స్ పేరుతో ముద్ర వేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబ్‌ బజారుకు చెందిన కొందరు వ్యాపా

  • Massive influx of students from private schools to government schools in AP.

    Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక

  • AP government gives key posting to IAS officer Srilakshmi.

    IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్..

  • AP CM Chandrababu's funny tweet... Netizens are laughing heartily.

    CM Chandrababu Tweet: ఏపీ సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్.. తెగ నవ్వుతున్న నెటిజన్లు

Latest News

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

  • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

  • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd