Special Song On Chandrababu Arrest : జనం గుండెల్లో చంద్రబాబు..
ఏపీ రాజకీయాల్లో మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అరెస్ట్ సంచలనంగా మారింది.
- By Maheswara Rao Nadella Published Date - 05:59 PM, Thu - 14 September 23

Special Song On Chandrababu Arrest : ఏపీ రాజకీయాల్లో మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు అరెస్ట్ సంచలనంగా మారింది. ఇప్పటికే అక్రమ అరెస్ట్ పై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పై పలు రాజకీయ పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు. మరోవైపు బాబుకు మద్దత్తుగా తెలుగు ప్రజలు నిలబడుతున్నారు. బాబు వెంటే తాము అంటూ అండగా ఉన్నారు. ఎవరికి తోచిన రీతిన వారు అందరు అక్రమ అరెస్ట్ పై స్పందిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంగీత దర్శకులు సుకుమార్ రెడ్డా స్వయంగా రచించి, గానం అందించిన భూమాత సహనం నీలో ఉందయ్యా అనే పాట రూపొందించారు. ఓర్చుకోవాలయ్యా లంటూ చంద్రబాబు (Chandrababu) కు ధైర్యం చెప్పెలా చాలా ఎమోషనల్ వైసీపీ కుట్రలను తన దైన శైలిలో సుకుమార్ ఈ పాట ను రాసి..బాణి కట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు ఈ పాటను సోషల్ మాడియాలో ఈ పాటను వైరల్ చేశారు.
Also Read: KTR: అమెరికా పోలీసులపై కేటీఆర్ ఫైర్, ఎందుకంటే