HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Speaker Ayyannapatra Clarity On Opposition Status For Ycp

Jagan : వైసీపీకి ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్లారిటీ

Jagan : ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను చూస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యమయ్యే విషయమికాదని స్పష్టం చేశారు

  • Author : Sudheer Date : 10-02-2025 - 6:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Speaker Ayyannapatra Clarit
Speaker Ayyannapatra Clarit

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Andhra Pradesh Assembly Budget Meetings) ఫిబ్రవరి 24 నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Jagan) హాజరవుతారా, లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తుండగా, వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా లభిస్తే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎక్కువ సమయం దక్కుతుందని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రతిపక్ష హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను చూస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యమయ్యే విషయమికాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా పొందేందుకు కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అని ఆయన తెలిపారు. చట్టాలు, నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని అన్నారు.

Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ చీఫ్ ఆయనే ? బీసీ నేతకు బిగ్ ఛాన్స్ ?

అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలనే సూచించారు. అసెంబ్లీకి రాకుండా బయట నుండి విమర్శలు చేయడం సరికాదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు ఇచ్చినంత సమయాన్ని తనకు ఇవ్వాలని జగన్ కోరడం న్యాయసమ్మతమా? అని ప్రశ్నించారు. ఏ నియమం ప్రకారం అదనపు సమయం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారో చెప్పాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చని స్పీకర్ పేర్కొన్నారు. సభకు హాజరుకాలేకపోతే, తగిన కారణాలను తెలియజేస్తూ స్పీకర్‌కు లేఖ రాయాలని సూచించారు. సరైన కారణం ఉంటేనే అనుమతి ఇవ్వబడుతుందని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరి జగన్ ఏంచేస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh Assembly Budget Meetings
  • jagan
  • opposition status for YCP
  • Speaker Ayyannapatra

Related News

Duvvada Jagan

దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గతంలో విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసి, ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు కనిపిస్తోంది

  • Nara Lokesh Pawan Kalyan

    అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి

  • Jagan Assembly

    జగన్ తన 11 మంది తో 11 న అసెంబ్లీకి వస్తాడా ?

  • Jagan Vijay

    జగన్ తో TVK విజయ్..ఫ్యాన్స్ లో ఆసక్తి

  • 'corrupt' Politics In Ap

    ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!

Latest News

  • ఉద‌యం మీరు కూడా ఇలాంటి త‌ప్పులు చేస్తున్నారా?

  • ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శ‌ర్మ‌!

  • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

  • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

  • ధోనీ రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన డి కాక్‌!

Trending News

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd