AP BJP: రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన ప్రకటన చేశారు. తాను 2024 తర్వాత రాజకీయాలలో ఉండనని ప్రకటించారు.
- Author : Siddartha Kallepelly
Date : 07-12-2021 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన ప్రకటన చేశారు. తాను 2024 తర్వాత రాజకీయాలలో ఉండనని ప్రకటించారు.
గత 42 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని ఏనాడు పదవులకోసం ఆరాటపడలేదని సోమువీర్రాజు తెలిపారు. గతంలో చంద్రబాబు తనకు మంత్రిపదవి ఇస్తానన్నా వద్దని చెప్పానని, తనకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, రాజకీయాల్లో ఉండి నిస్వార్థంగా పనిచేశానని ఆయన తెలిపారు.
ఏపీలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశమివ్వాలని ఆయన కోరారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైతే కేంద్రానికి అప్పగిస్తే తామే కట్టిస్తామని సోమువీర్రాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు.
♦పోలవరం ప్రాజెక్టుకు నిధులు అన్నీ కేంద్రం ఇస్తుంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.
♦లక్షలాది రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.@somuveerraju @BJP4Andhra pic.twitter.com/m6k4EeBRL8— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) December 7, 2021