Smart Meters : మోటార్లకు మీటర్లపై రూ. 29వేల కోట్ల కుంభకోణం రచ్చ
స్మార్ట్ మీటర్ల రూపంలో (Smart Meters )భారీ స్కామ్ కు ఏపీలో తెరలేచింది. ఆ విషయాన్ని తెలియచేస్తూ విపక్షాలు ఇప్పటికే రోడ్డెక్కాయి.
- By CS Rao Published Date - 02:21 PM, Thu - 25 May 23

స్మార్ట్ మీటర్ల రూపంలో (Smart Meters )భారీ స్కామ్ కు ఏపీలో తెరలేచింది. ఆ విషయాన్ని తెలియచేస్తూ విపక్షాలు ఇప్పటికే రోడ్డెక్కాయి. సుమారు రూ. 29వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని లెక్కలను బయటకు తీస్తున్నారు. కేవలం తమ్ముడు అవినాష్ కళ్లలో ఆనందం కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) స్మార్ట్ మీటర్ల టెండర్ రూపంలో దోపిడీకి పాల్పడుతున్నాడని విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. వాళ్లు చెబుతోన్న దాని ప్రకారం..స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ల కాంట్రాక్టులు వైఎస్ అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ షిరిడీ సాయికి కట్టబెట్టడంలో రూ.29 వేల కోట్ల కుంభకోణం జరిగిందట.
స్మార్ట్ మీటర్ల రూపంలో భారీ స్కామ్(Smart Meters )
ఉచితంగా ఇచ్చే విద్యుత్ కు మీటర్లు అవసరం ఏమిటి? అనేది ప్రాథమిక ప్రశ్న. అంతేకాదు, వాటి నిర్వహణ కోసం ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వెనుక రూ. 29వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని సర్వత్రా వినిపిస్తోంది. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు మోటార్లకు స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బిగించారు. రాష్ట్రం మొత్తం స్మార్ట్ మీటర్లను(Smart Meters) బిగించడానికి జగన్ సర్కార్ వెనుకాడడంలేదు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ల బిగించే టెండర్ కడపలోని షిరిడీ సాయి(Shirdi sai) కంపెనీ దక్కించుకుంది. దాని ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఉంది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ టెండర్ ను ఎస్పీడీసీఎల్ సీఎండీ సమక్షంలోనే కొట్టేశారని టీడీపీ చేస్తోన్న ప్రధాన ఆరోపణ. వాస్తవంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బిగించిన స్మార్ట్ మీటర్ విలువ రూ.10 వేల లోపే ఉండగా ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.36,975గా నిర్ణయించడం బరితెగింపు కింద చెప్పుకోవాలి. మీటర్ రీడింగ్ (Smart Meters) భారాన్ని కూడా నెలకు రూ.5.30 నుంచి రూ.153కి పెంచేస్తున్నారని టీడీపీ చెబుతోంది. ఈపీడీసీఎల్ పరిధిలోనూ నామమాత్రపు పోటీతో షిరిడీ సాయికే స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు వెళ్లింది.
మూడు డిస్కంలకు కలిపి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.78 వేల కోట్లు చెల్లించాలి
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత మూడు విద్యుత్ డిస్కంల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు, నిర్వహణ, స్మార్ట్ మీటర్ల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. మూడు డిస్కంలకు కలిపి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.78 వేల కోట్లు చెల్లించాలి.ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ డొమస్టిక్ స్మార్ట్ మీటర్ల పేరుతో అదనంగా మరో రూ.29 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బినామీ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టి దోచిపెట్టడానికి హద్దులు దాటి వ్యవహరించారని ఆరోపించారు.
వ్యవసాయంలో కీలకమైన ట్రాన్స్ ఫార్మర్ల సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఇబ్బందులు పడుతారు. సరఫరాలో కాంట్రాక్టర్ అలక్ష్యం చేస్తే జరిమానా ఉండేది. ఆ విధంగా గత ప్రభుత్వ హయాంలో రూ.500 కోట్ల పెనాల్టీ విధించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్క షిరిడీ సాయి కంపెనీపైన పెనాల్టీలను రద్దు చేయడంతో పాటు ట్రాన్స్ ఫార్మర్ రేట్లను అడ్డుఅదుపూ లేకుండా పెంచేశారు. 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.58,569 ఉంటే రూ.1,78,800కి పెంచారు..63 కేవీని రూ.89 వేలు నుంచి రూ.2.54 లక్షలకు, 160కేవీని రూ.2 లక్షలు నుంచి రూ.5.69 లక్షలకు, 315 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ను రూ. 5.71 లక్షల నుంచి రూ,16.75 లక్షలకు పెంచారు. అడ్డగోలుగా ట్రాన్స్ ఫార్మర్ల ధరలు పెంచి సరఫరా కాంట్రాక్టును ఏకఛత్రాధిపత్యంగా షిరీడీ సాయి(Smart Meters) చేతిలో పెట్టారని ఆరోపణ.
29వేల కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని విపక్షాలు ఫిర్యాదు
గతంలో నాలుగు కంపెనీలు ట్రాన్స్ ఫార్మర్లను సరఫరా చేయగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క షిరిడీ సాయి సంస్థకే ఆ అవకాశం ఇచ్చారు. ట్రాన్స్ ఫార్మర్ల తరహాలోనే ఇప్పుడు స్మార్ట్ మీటర్ల (Smart Meters) విషయంలోనూ భారీ స్కామ్ కు తెరలేచిందని టీడీపీ చెబుతోంది. ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా మూడు డిస్కంల సీఎండీలను కోరితే స్పందించకపోవడం గమనార్హం. విద్యుత్ శాఖ కార్యదర్శిని సంప్రదించించిన తర్వాత ఒక్క ఈపీడీసీఎల్ అధికారులు కొంత సమాచారం పంపారని చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. బిడ్డింగ్ లో రెండు సంస్థలే పాల్గొన్నాయని, 2.58 లక్షల అగ్రికల్చర్ సర్వీసులకు ఒక్కో మీటరుకు షిరిడీ సాయి సంస్థ రూ.23,647కి, అదానీ కంపెనీ రూ.24,300కి కోట్ చేయడం స్కామ్ జరిగిందని అనుమానాన్ని రేకెత్తిస్తోంది. అదానీ కంటే షిరిడీ సాయిసంస్థ కేవలం రూ.600 తక్కువకు కోట్ చేయడం భారీ స్కామ్ కు బీజం పడింది. తిరుపతి, విజయవాడలోని సీఎండీలు ఇంకా సమాచారం ఇవ్వలేదని చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Y Not Jagan : అమ్మో..YS ఫ్యామిలీ! DK వెనుక `వై నాట్ కర్ణాటక `!!
తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ పరిధిలో సేకరించిన సమాచారం ప్రకారం ఒక్కో మీటరుకు మెయింటెనెన్స్ తో కలిపి రూ.36,975గా నిర్ణయించారని టీడీపీ చెబుతోంది. ఇంట్లో మీటర్ రీడింగ్ కు నెలకు రూ.153 అంటే ఏడాదికి రూ.1840 వినియోగదారుడు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య, పరిశ్రమ కనెక్షన్లకు నెలకు రూ.241.90 ఏడాదికి రూ.2,903 చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. ప్రస్తుతం మీటర్ రీడింగ్ రూ. 5.30 పైసలు ఖర్చు అవుతుండగా దానిని రూ.153కి పెంచబోతున్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆధ్వర్యంలో షిరిడీ సాయి (Shirdi sai) ఆఫీసులో సమీక్షలు నిర్వహించి కాంట్రాక్టును వారికి సెటిల్ చేశానని చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. `పక్కా సమాచారంతో మేం ఈ విషయం చెబుతున్నాం. గూగూల్ టేక్ అవుట్ తీస్తే అవినాష్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ, అధికారులు, షిరిడీ సాయి ఎండీ విశ్వేశ్వరరెడ్డిల సమావేశాల గుట్టు మొత్తం బయటపడుతుంది` అంటూ డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ విచారణ జరిగేతేనే ఈ కుంభకోణం మొత్తం వెలుగులోకి వస్తుందని అన్నారు.
YCP Criminal status : YCP నేర చిట్టా విప్పిన CBN! జగన్ జమానాలో 70శాతం పెరిగిన కోర్టు ఖర్చు!!
ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పై నెలల తరబడి విచారణ సాగిస్తూ అరెస్టుల మీద అరెస్టులు చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఏపీలో రైతులు, ప్రజలను ముంచే భారీ కుంభకోణం కనిపించడం లేదా ? అంటూ చంద్రమోహన్ రెడ్డి నిలదీస్తున్నారు.ఇప్పటికే డిస్కమ్ లకు రూ.74 వేలు కోట్లు బకాయిలు ఉండగా, మళ్లీ ఇప్పుడు రూ.29 వేల కోట్లు భారం వేస్తున్నారు.ఈ అప్పుల భారం ఎవరు భరించాలి? అంటూ టీడీపీ నిలదీస్తోంది. రాజస్థాన్ లో ఒక్కో మీటర్ ను మెయింటెనెన్స్ తో కలిపి రూ.7,945 , ఛండీగర్ లో రూ.9,710గా ఉంటే ఏపీలో ఎందుకు అంత భారం మోపారని ప్రశ్నిస్తున్నారు.
పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వెంటనే స్పందించి ఈ స్కామ్ (Smart Meters ) విషయంలో తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవరిస్తూ పోతే అంతిమంగా బాధితులు ఏపీలోని ఐదు కోట్ల ప్రజలు అవుతారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 29వేల కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని విపక్షాలు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళన బాటపట్టేందుకు సిద్దమయ్యాయి.

Related News

Mid term poll :`ముందస్తు`దిశగా జగన్ రాజకీయ రివ్యూలు
రాజకీయ రివ్యూ మీటింగ్ లు పెడుతోన్న జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు(Mid term poll) ప్లాన్ చేసుకుంటున్నారని బలంగా టాక్ ఉంది.